UPSC: సివిల్స్ దరఖాస్తు ప్రక్రియలో మార్పులు
ABN , Publish Date - Feb 14 , 2025 | 05:37 AM
సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల ఫిర్యాదుల నేపథ్యంలో ఈ ఏడాది ప్రిలిమ్స్ పరీక్ష ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియలో యూపీఎస్సీ పలు మార్పులు చేసింది. దరఖాస్తు సమయంలో సాంకేతిక లోపాలు ఎదురవుతున్నాయని అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంది.

కొన్ని ఎంట్రీలను ‘ఎడిట్’ చేసుకొనే అవకాశం కల్పించిన యూపీఎస్సీ
పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ మార్పునకు నో చాన్స్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల ఫిర్యాదుల నేపథ్యంలో ఈ ఏడాది ప్రిలిమ్స్ పరీక్ష ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియలో యూపీఎస్సీ పలు మార్పులు చేసింది. దరఖాస్తు సమయంలో సాంకేతిక లోపాలు ఎదురవుతున్నాయని అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంది. మార్పులకు సంబంధించి కమిషన్ అధికారిక నోటీస్ విడుదల చేసింది. వన్-టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్)లో కొన్ని ఎంట్రీలను ‘ఎడిట్’ చేసుకొనే అవకాశం కల్పించినట్లు తెలిపింది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష-2025 దరఖాస్తు గడువును ఈనెల 18 వరకు పొడిగించగా.. తుది దరఖాస్తు సమర్పణ తర్వాత ఏవైనా మార్పులు/సవరణలు ఉంటే 19 నుంచి 25వ తేదీ వరకు అవకాశం ఉంటుందని పేర్కొంది. దరఖాస్తు తుది సమర్పణ వరకు, ఆ తర్వాత మైనారిటీ స్థితి, 10 తరగతి రోల్ నంబర్ వంటి వాటిల్లో తప్పులు ఉంటే మార్చుకోవచ్చని యూపీఎస్సీ తెలిపింది. అయితే ఓటీఆర్ ప్రొఫైల్‌లోని పేరు, పుట్టినతేదీ, తల్లిదండ్రుల పేర్లు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ కాలమ్స్‌లో మార్పులకు అవకాశం ఉండదని పేర్కొంది. పేరు మార్చుకున్నా లేదా మెట్రిక్యులేషన్/ఉన్నత విద్య సర్టిఫికెట్‌లోని పేరులో దోషం ఉన్న సందర్భాల్లో గెజిట్ నోటిఫికేషన్ సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి లేకుంటే.. ప్రిలిమ్స్ ఫలితాల తర్వాత ఆన్‌లైన్‌లో సమర్పించొచ్చని పేర్కొంది. అభ్యర్థి తన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీ యాక్సెస్ ను కోల్పోతే.. ఒకదాని ఆధారంగా మరో దాన్ని మార్చుకోవచ్చని తెలిపింది. రెండింటి యాక్సెస్ కోల్పోతే అవసరమైన మార్పుల కోసం కమిషన్‌కు అభ్యర్థన పెట్టుకోవాలని సూచించింది.
47 పోస్టులతో ఐఈఎస్ నోటిఫికేషన్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 47 పోస్టులతో ఇండియన్ ఎకనమిక్ సర్వీ్‌స(ఐఈఎస్), ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీ్‌స(ఐఎ్‌సఎస్) ఎగ్జామ్ 2025కి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 4వ తేదీ లోపు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ఠఞటఛి.జౌఠి.జీుఽ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 2025 ఆగస్టు 2 నాటికి 21 నుంచి 30 ఏళ్లలోపు వయస్సు ఉండాలి. పూర్తి వివరాలకు యూపీఎస్సీ నోటిఫికేషన్ చూడవచ్చు.