Share News

Telugu Eco Warriors: స్వచ్ఛ్ భారత్ స్ఫూర్తితో బహ్రెయిన్ సముద్ర తీరంలో తెలుగు ప్రవాసీయుల పర్యావరణ పండుగ

ABN , Publish Date - Feb 19 , 2025 | 04:00 PM

స్వచ్ఛ్ భారత్ స్ఫూర్తితో బహ్రెయిన్‌లోని కొందరు తెలుగు ప్రవాసీయులు తెలుగు ఇకో వారియర్స్ పేరిట శ్రీకారం చుట్టిన సముద్ర తీరాల పరిశుభ్రత కార్యక్రమం ఒక సంవత్సరం పూర్తి చేసుకోని పర్యావరణ పండుగ జరుపుకొంది.

Telugu Eco Warriors: స్వచ్ఛ్ భారత్ స్ఫూర్తితో బహ్రెయిన్ సముద్ర తీరంలో తెలుగు ప్రవాసీయుల పర్యావరణ పండుగ

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఒక యజ్ఞంగా కొనసాగుతున్న స్వచ్ఛ్ భారత్ అభియాన్ ఎల్లలు దాటి అరేబియా సముద్ర అలలకు తాకుతుంది (NRI).

స్వచ్ఛ్ భారత్ స్ఫూర్తితో బహ్రెయిన్‌లోని కొందరు తెలుగు ప్రవాసీయులు తెలుగు ఇకో వారియర్స్ పేరిట శ్రీకారం చుట్టిన సముద్ర తీరాల పరిశుభ్రత కార్యక్రమం ఒక సంవత్సరం పూర్తి చేసుకోని పర్యావరణ పండుగ జరుపుకొంది. బహ్రెయిన్‌లోని సముద్ర పర్యావరణ ప్రేమికులు, స్థానిక ప్రవాసీ ప్రముఖులు కోటగిరి నవీన్, కొత్తపల్లి రాం మోహన్‌ల ఆధ్వర్యంలో మొదలైన పరిశుభ్రత కార్యక్రమం పర్యావరణ ప్రేమికుల చొరవతో ఒక యజ్ఞంగా మారి ఇటీవల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకొంది.

ప్రతి వారాంతం కుటుంబ సమేతంగా సముద్ర తీరాలకు వెళ్ళడం ప్రవాసీ కుటుంబాలకు ఒక అలవాటు కానీ తీర ప్రాంతాలలో పర్యాటకులు తిని పారేసే ప్లాస్టిక్ చెత్త వ్యర్ధాలు, సీసాలు పర్యావరణ హాని కల్గిస్తున్నాయనే విషయాన్ని అనేక మంది మరిచిపోతున్నారని తెలుగు ఇకో వారియర్స్ పేర్కొంది.

జీవితంలో ఎక్కువ భాగంగా బహ్రెయిన్‌లో గడుపుతున్న తమకు ఇది కర్మభూమి అని ఇక్కడి పర్యారవణ, పరిశుభ్రత కూడా తమ బాధ్యత అని మోహన్, నవీన్‌లు పేర్కొన్నారు. ఒక సంవత్సరం పాటు ప్రతి శుక్రవారం కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛత పాటించిన కెప్టెన్ మహేశ్ మీరా, పరమేశ్వర్‌లను అభినందించారు.

3.jpg


Oman: ఒమాన్ టి.కె.యస్ ఎన్నికలలో అందరి భాగస్వామ్యం

పర్యావరణ ప్రకృతి పరిరక్షణలో తమకు నిరంతరం మద్దతునిస్తున్న రఘునాథ బాబు, హరిబాబు, జగదీశ్, రాజశేఖర్, భాస్కర్ రావులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు కళా సమితి, తెలంగాణ కల్చరల్ అసోసియేషన్‌లకు కూడా వీరు కృతజ్ఞతలు తెలిపారు.

బహ్రెయిన్‌లోని ప్రవాసీయులందరూ ప్రతివారం ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తెలుగుదేశం బహ్రెయిన్ అధ్యక్షుడు రఘునాథ బాబుతో పాటు మురళీకృష్ణ , హరిబాబులు అభ్యర్థించారు. తెలుగు కళా సమితి మాజీ అధ్యక్షులు టి హరిబాబు, మురళీకృష్ణ, రాజ శేఖర్ కొత్తపల్లి, నోముల మురళి, టీకేఎస్ సభ్యులు, తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ బహ్రెయిన్, పద్మశాలి సంఘం బహ్రెయిన్ సభ్యులు స్వచ్ఛ్ బహ్రెయిన్/ తెలుగు వారియర్స్ కమిటీకి అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు.

తెలుగు కళా సమితి అధ్యక్షులు జగదీష్, రఘునాధ బాబు, మురళీకృష్ణ, తక్కెళ్లపాటి హరిబాబు, భాస్కర్ రావు, రాజశేఖర్ కొత్తపల్లి, అనిల్ కుమార్ పమిడి, అనిల్ ఆరె, సతీష్ సెట్టి, ఇంతియాజ్ మహ్మద్, సతీష్ బొల్లా, దాసరథరామిరెడ్డి (నోయల్), చంద్రబాబు, రాజ్ కుమార్, మురళి, చంద్రబాబు విజయేందర్‌రెడ్డి, వైటల్‌ ఆరె, మహేశ్వరరెడ్డి, మౌళి చౌదరి, వంశీకృష్ణ, కిరణ్‌ (బీఎంసీ) రాయుడు భాస్కర్‌, నరేష్‌, సందీప్‌, పుల్లారావు, టీకేఎస్‌, తెలంగాణ కల్చరల్‌ అసోసియేషన్‌ బహ్రెయిన్‌, పీఎస్‌బీ టీమ్‌ సభ్యులు సుధాకర్‌, శంకర్‌, నరేష్‌, సాయికిరణ్‌, తెలుగు వారి టీమ్‌కు తెలుగు ప్రముఖులు హాజరై అభినందనలు తెలిపారు.

2.jpg


తోటి ప్రవాసీలకు సాయపడ్డ తెలుగు మహిళకు దుబాయ్‌లో పురస్కారం

తెలుగు వారియర్స్ కమిటీ సభ్యులు నవీన్ కుమార్ కోటగిరి, రామమోహన్ కొత్తపల్లి, మహేష్ మీరా, పెప్సీ అశోక్, పెప్సీ బుయాని గంగాధర్, పెప్సీ తిరుపతి, పరమేశ్వర్, అరవింద్, నవీన్, గంగా రెడ్డి, రంజిత్, సుమన్, పెప్సీ సుమన్ యెర్రోళ్ల, సతీష్, శేఖర్, వంశీ కృష్ణ, సురేష్, సుధాకర్, వంశీ కృష్ణ, సురేష్, నవీన్ కుమార్, సురేష్, నవీన్ కుమార్ ఎన్.ఎస్., నాగేశ్వరరావు, శ్రీనివాస్, రాజేష్, నరసారెడ్డి, భీమేష్, సాగర్, నరేందర్, రాజు, తిరుపతి గౌడ్, కిరణ్, మధు గౌడ్, మైదం సురేష్, సాయి కుమార్, అజయ్, రవి, శ్యామ్, కిరణ్, సందీప్, మౌళి చౌదరి, నరేష్ రాజు, శ్రీ పుల్లారావు, శ్రీకాంత్, నరెందర్‌గాని, అశ్నూర్ సగిరి, వి. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొని మిఠాయిలు పంచుకున్నారు.

ఈ కార్యక్రమానికి అల్పాహారం, నీరు, జ్యూస్ స్వీట్లు ఏర్పాటు చేసిన సురేష్ బాబు (ఏఎల్‌బీఏ), పెప్సీ టీమ్ అశోక్, గంగాధర్, తిరుపతి, అనిల్ అరె, మహేష్ మీరా, సతీష్ సెట్టి, తక్కెళ్లపాటి హరిబాబు, వంశీ కృష్ణ జాగర్లమూడి (అమృతం సూపర్ మార్కెట్) లకు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Read Latest and NRI News

Updated Date - Feb 19 , 2025 | 04:05 PM