Viral Video: మృత్యువుకే వణుకు పుట్టిస్తున్నాడుగా.. ఈ వృద్ధుడు ఎలా చలి కాచుకుంటున్నాడో చూడండి..
ABN , Publish Date - Feb 03 , 2025 | 09:55 AM
కొందరు ప్రతి చిన్న విషయానికి భయపడుతుంటారు. చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మరికొందరు మాత్రం ధైర్యంగా ఉంటారు. ఇంకా కొందరు ప్రమాదాలతోనే ఆటలాడుతుంటారు. ప్రమాదమని తెలిసినా సాహసాలు చేస్తుంటారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత అలాంటి కొన్ని వీడియోలు మన కళ్ల ముందుకు వచ్చాయి.

ఈ ప్రపంచంలో ఒక్కొక్కరూ ఒక్కోలా బిహేవ్ చేస్తుంటారు. కొందరు ప్రతి చిన్న విషయానికి భయపడుతుంటారు. చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మరికొందరు మాత్రం ధైర్యంగా ఉంటారు. ఇంకా కొందరు ప్రమాదాలతోనే ఆటలాడుతుంటారు. ప్రమాదమని తెలిసినా సాహసాలు (Adventures) చేస్తుంటారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత అలాంటి కొన్ని వీడియోలు మన కళ్ల ముందుకు వచ్చాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).
farhan_siddiqi అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వృద్ధుడు చలి (Cold) బాగా ఉండే చీకటి సమయంలో ఆరు బయట ఓ కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. అతడి ముందు ఓ గ్యాస్ సిలెండర్ (Gas Cylinder) ఉంది. ఆ సిలెండర్ క్యాప్ ఓపెన్ చేసి దానికి మంట (Fire) పెట్టి, ఆ మంటతో ఆ వృద్ధుడు చలి కాచుకుంటున్నాడు. అది ఎంత ప్రమాదకరమో తెలిసిందే. ఏ మాత్రం తేడా వచ్చిన ఆ మంట కారణంగా ఆ సిలెండర్ మొత్తం పేలిపోయి పరిసర ప్రాంతాలన్నింటికీ నష్టం వాటిల్లుతుంది. ఆ వ్యక్తి చేస్తున్న పనిని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 50 లక్షల మందికి పైగా వీక్షించారు. మూడు లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``బ్రదర్, ఇది బీహార్, ఇక్కడ ఏదైనా జరగవచ్చు``, ``ఇది ఓల్డ్ మాంక్ యొక్క శక్తి``, ``అతడికి ప్రాణాలంటే లెక్క లేదు``, ``అతడిని చూస్తే మృత్యువే భయపడుతుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Funny Viral Video: మందుబాబులకు ఆ మాత్రం జాగ్రత్త ఉండాలి.. పర్సులో అతను ఏం దాచాడో చూడండి..
Weight Loss: కేవలం 15 రోజుల్లో 10 కేజీల బరువు తగ్గాడు.. చివరకు అతడి పరిస్థితి ఏమైందంటే..
Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ప్రాణం పోతున్నా ఆహారాన్ని వదలని కొండచిలువ.. చివరకు..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి