Share News

Dog and Snake Video: కుక్క vs పాము, భయంకర పోరాటంలో ఎవరు గెలిచారో చూడండి.. వీడియో వైరల్..

ABN , Publish Date - Mar 11 , 2025 | 08:47 AM

మనుషులే కాదు.. జంతువులు కూడా పాములు జోలికి వెళ్లవు. విషపూరిత సర్పాలు కాటేస్తే క్షణాల్లో ప్రాణాలు పోవడం ఖాయం. దీంతో పెద్ద పెద్ద జంతువులు కూడా పాములకు దూరంగానే ఉంటాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ కుక్క మాత్రం అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించింది.

Dog and Snake Video: కుక్క vs పాము, భయంకర పోరాటంలో ఎవరు గెలిచారో చూడండి.. వీడియో వైరల్..
Dog and Snake Video

సాధారణంగా ఈ ప్రపంచంలో ఎక్కువ మంది పాములంటేనే (Snakes) భయపడతారు. పాము ఉందని తెలిస్తే అటు వైపు వెళ్లడానికి కూడా భయపడతారు. మనుషులే కాదు.. జంతువులు కూడా పాములు జోలికి వెళ్లవు. విషపూరిత సర్పాలు కాటేస్తే క్షణాల్లో ప్రాణాలు పోవడం ఖాయం. దీంతో పెద్ద పెద్ద జంతువులు కూడా పాములకు దూరంగానే ఉంటాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ కుక్క మాత్రం అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించింది. నాగుపాముకు (King Cobra) చుక్కలు చూపించింది.


lone_wolf అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో (Viral Video) ప్రకారం.. ఓ ఇంటి తోటలోకి ఓ నాగుపాము ప్రవేశించింది. ఓ మొక్క దగ్గర ఉన్న ఆ పామును రోట్వీలర్ కుక్క (Rottweiler dog) చూసింది. వెంటనే అరుచుకుంటూ ఆ కుక్కపై దాడికి దిగింది. కుక్కపై పాము కూడా దాడి చేయడానికి ప్రయత్నించింది. రెండు సార్లు కాటు వేయడానికి ప్రయత్నించింది. ఆ కాటు నుంచి తప్పించుకున్న కుక్క పామును నోటితో పట్టుకుని రెండు ముక్కలు చేసేసింది. ఆ పాము చనిపోయే వరకు దాడి చేస్తూనే ఉంది. ఆ ఘటనను ఆ ఇంటి యజమాని వీడియో తీశారు.


ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు కోట్ల మంది వీక్షించారు. 10 లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. రోట్వీల్లర్ డాగ్స్ ఏదైనా ప్రమాదాన్ని పసిగడితే ధైర్యంగా పోరాడతాయని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. ఆ కుక్క బలం, ధైర్యం ముందు విషపూరిత సర్పం కూడా బలహీనంగా మారిపోయింది.


ఇవి కూడా చదవండి..

Viral Video: ఇదేంది అక్కా.. కొంచెం ఆగాలి కదా.. రైల్వే గేట్ దగ్గర తొందరపడిన ఓ మహిళ పరిస్థితి చూడండి..


Jugaad Viral Video: వావ్.. టెక్నాలజీని ఇలా కూడా వాడొచ్చా.. ఈ వ్యక్తి తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..


Snake Viral Video: బోనులోకి వెళ్లి గుడ్డును మింగిన పాము.. చివరకు దాని పరిస్థితి ఏమైందంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Mar 11 , 2025 | 08:47 AM