Share News

Spider rain in Brazil: ఆకాశం నుంచి సాలెపురుగల వర్షం.. బ్రెజిల్‌లో వింత ఘటన.. కారణం ఏంటో తెలిస్తే..

ABN , Publish Date - Feb 03 , 2025 | 12:04 PM

బ్రెజిల్‌లోని ఓ పట్టణంలో ఆకాశం నుంచి సాలెపురుగుల వర్షం కురిసింది. వందల కొద్దీ సాలెపురుగులు ఆకాశం నుంచి భూమి మీద పడ్డాయి. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కానీ బ్రెజిల్‌లోని మినాస్ గెరైస్‌లో ఉన్న సావో థోమ్ దాస్ లెట్రాస్ సిటీలో ఈ అద్భుతం జరిగింది.

Spider rain in Brazil: ఆకాశం నుంచి సాలెపురుగల వర్షం.. బ్రెజిల్‌లో వింత ఘటన.. కారణం ఏంటో తెలిస్తే..
spiders raining from sky

ఆకాశం నుంచి వర్షంతో పాటు పిడుగులు పడడం మనందరికీ తెలుసు. కొన్ని ప్రాంతాల్లో చేపల వర్షం కురిసిందని కూడా అప్పుడప్పుడు వింటూ ఉంటాం. అయితే బ్రెజిల్‌లోని ఓ పట్టణంలో వింత ఘటన చోటు చేసుకుంది. ఆ పట్టణంలో ఆకాశం నుంచి సాలెపురుగుల (Spiders) వర్షం కురిసింది. వందల కొద్దీ సాలెపురుగులు ఆకాశం నుంచి భూమి మీద పడ్డాయి (Spiders Rain). ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కానీ బ్రెజిల్‌ (Brazil)లోని మినాస్ గెరైస్‌లో ఉన్న సావో థోమ్ దాస్ లెట్రాస్ సిటీలో ఈ అద్భుతం జరిగింది (Viral Video).


వందలాది సాలెపురుగులు ఆకాశం నుంచి కిందకు పడిపోవడంతో స్థానిక ప్రజలు, ఆన్‌లైన్ వీక్షకులు పెద్ద షాక్‌కు గురయ్యారు. ఈ సీన్ హారర్ సినిమాలా అనిపించింది. దీని గురించి ప్రజలు రకరకాల చర్చలు చేస్తున్నారు. అయితే దీని వెనుకున్న కారణాన్ని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇది చాలా సహజమైన ప్రక్రియ అని జీవశాస్త్రవేత్త కైరోన్ పాసోస్ పేర్కొన్నారు. ఆయన చెప్పిన దాని ప్రకారం.. సాలెపురుగులలో స్టెగోడిఫస్, అనెలోసిమస్ వంటి జాతులు ప్రత్యేకంగా వలలను నిర్మించడంలో ప్రసిద్ధి చెందాయి. ఆ వలలో ఆ జాతి స్పైడర్స్ అన్నీ కలిసి నివసిస్తాయి.


సాధారణంగా ఆడ సాలెపురుగులు వేర్వేరు మగ స్పైడర్స్ నుంచి స్పెర్మ్‌ తీసుకుని అండాలను ఫలదీకరణం చేస్తాయి. దాంతో వైవిధ్యమైన సంతానం పొందే అవకాశం పెరుగుతుంది. ఆ వలల్లో ఆడ, మగ స్పైడర్స్ అన్నీ కలిసి నివసిస్తాయి. సంభోగం తర్వాత సాధారణంగా ఈ సాలెపురుగులు చెల్లాచెదురు అవుతాయి. ఆ సమయంలో అవి వలల నుంచి బయటపడి ఇలా కనబడతాయి. నిజానికి మినాస్ గెరైస్‌లో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు. 2019 సంవత్సరంలో కూడా ఇదే తరహాలో సాలెపురుగుల వర్షం కురిసి నగరం మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది.


ఇవి కూడా చదవండి..

Viral Video: తలుపు తెరవగానే మృత్యు దేవత.. వీడియో చూస్తే భయంతో వణికిపోవాల్సిందే..


Viral Video: మృత్యువుకే వణుకు పుట్టిస్తున్నాడుగా.. ఈ వృద్ధుడు ఎలా చలి కాచుకుంటున్నాడో చూడండి..


Optical Illusion: మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ పువ్వుల మధ్య సీతాకోక చిలుక ఎక్కడుందో 10 సెకెన్లలో కనిపెట్టండి..


Funny Viral Video: మందుబాబులకు ఆ మాత్రం జాగ్రత్త ఉండాలి.. పర్సులో అతను ఏం దాచాడో చూడండి..


Weight Loss: కేవలం 15 రోజుల్లో 10 కేజీల బరువు తగ్గాడు.. చివరకు అతడి పరిస్థితి ఏమైందంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 03 , 2025 | 12:04 PM