Share News

Viral Video: తలుపు తెరవగానే మృత్యు దేవత.. వీడియో చూస్తే భయంతో వణికిపోవాల్సిందే..

ABN , Publish Date - Feb 03 , 2025 | 11:17 AM

ఇంటి తలుపు తెరిచినపుడు ఎదురుగా మీరు ఊహించని ప్రమాదం పొంచి ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఊహకే ఒళ్లు గగుర్పొడుస్తోందా? తాజాగా ఓ వ్యక్తికి అలాంటి అనుభవమే ఎదురైంది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు.

Viral Video: తలుపు తెరవగానే మృత్యు దేవత.. వీడియో చూస్తే భయంతో వణికిపోవాల్సిందే..
Tiger viral Video

మీరు ఉదయాన్నే లేచి ఎంతో ప్రశాంతంగా ఇంటి తలుపు (Door) తెరిచినపుడు ఎదురుగా మీరు ఊహించని ప్రమాదం పొంచి ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఊహకే ఒళ్లు గగుర్పొడుస్తోందా? తాజాగా ఓ వ్యక్తికి అలాంటి అనుభవమే ఎదురైంది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో బతకడం చాలా కష్టమంటూ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఆ వీడియో సోషల్ మీడియా జనాలను ఆశ్చర్యపరుస్తోంది (Viral Video).


@AMAZlNGNATURE అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ మహిళ తన ఇంటి తలుపు తాళం తెరుస్తోంది. ఆ తలుపునకు అవతలి పక్కన ఓ పులి (Tiger) కూర్చుని ఉంది. దీంతో ఆ మహిళ తలుపును కొద్దిగానే తెరిచింది. ఆ మహిళ, పులి ఒకరినొకరు తీక్షణంగా చూసుకున్నారు. అంతలో పులి గర్జిస్తూ ముందుకు రాబోవడంతో ఆమె వెంటనే తలుపు మూసేసింది. ఆ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (Tiger Video).


ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు మూడో కోట్ల మంది వీక్షించారు. దాదాపు మూడు లక్షల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``అలాంటి పరిస్థితిలో నా మెదడు పని చేయడం మానేస్తుంది``, ``అది పెంపుడు పులి అనుకుంటున్నా``, ``ఇది చాలా షాకింగ్``, ``ఆ ఇల్లు అడవికి దగ్గరగా ఉందనుకుంటా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

Viral Video: మృత్యువుకే వణుకు పుట్టిస్తున్నాడుగా.. ఈ వృద్ధుడు ఎలా చలి కాచుకుంటున్నాడో చూడండి..


Optical Illusion: మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ పువ్వుల మధ్య సీతాకోక చిలుక ఎక్కడుందో 10 సెకెన్లలో కనిపెట్టండి..


Funny Viral Video: మందుబాబులకు ఆ మాత్రం జాగ్రత్త ఉండాలి.. పర్సులో అతను ఏం దాచాడో చూడండి..


Weight Loss: కేవలం 15 రోజుల్లో 10 కేజీల బరువు తగ్గాడు.. చివరకు అతడి పరిస్థితి ఏమైందంటే..


Viral Video: వీడు కన్న తండ్రా? కిరాతకుడా? మూడేళ్ల చిన్నారితో మంచులో ఎంత కర్కశంగా వ్యవహరిస్తున్నాడో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 03 , 2025 | 11:17 AM