Kumbh Mela: ఇది నిజమా?.. కుంభమేళాలో మొబైల్స్ ఛార్జింగ్ పెడుతూ ఇతడు అంత సంపాదిస్తున్నాడా?
ABN , Publish Date - Feb 12 , 2025 | 07:16 PM
మహా కుంభమేళాకు ఇప్పటికే దాదాపు 40 కోట్ల మంది హాజరయ్యారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌లో రెండు లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేశారు. అనుకున్నట్టుగానే కుంభమేళాలో చాలా మంది తమ తెలివితేటలు ఉపయోగించి డబ్బులు సంపాదించుకుంటున్నారు.

ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం అయిన కుంభమేళా (Maha Kumbh)కు కోట్లాది మంది భక్తులు వెళ్తూ పుణ్య స్నానాలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ (UttarPradesh)లోని ప్రయోగ్‌రాజ్ (Prayagraj)లో జరుగుతున్న మహా కుంభమేళాకు ఇప్పటికే దాదాపు 40 కోట్ల మంది హాజరయ్యారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌లో రెండు లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేశారు. అనుకున్నట్టుగానే కుంభమేళాలో చాలా మంది తమ తెలివితేటలు ఉపయోగించి డబ్బులు సంపాదించుకుంటున్నారు.
ప్రయాగ్‌రాజ్‌లో వేప పుల్లలు (Neem Sticks) అమ్ముకునే ఓ వ్యక్తి కేవలం ఐదు రోజుల్లోనే 40 వేల రూపాయలు సంపాదించినట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. తాజాగా అలాంటిదే మరో వ్యవహారం బయటకు వచ్చింది. కుంభమేళాకు హాజరయ్యే భక్తుల మొబైల్ ఫోన్లకు ఛార్జింగ్ సౌకర్యం కల్పిస్తూ మరో వ్యక్తి బాగా సంపాదిస్తున్నాడట. ఒక మొబైల్‌కు గంట సేపు ఛార్జ్ చేసినందుకు రూ.50 వసూలు చేస్తున్నాడట. అలా గంటకు ఒకేసారి 20 మొబైల్స్‌కు ఛార్జింగ్ పెడుతున్నాడు. అంటే గంటకు అతడి సంపాదన వెయ్యి రూపాయలు. అతడికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను దాదాపు 70 లక్షల మంది వీక్షించారు. 6.5 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోలో చెప్పిన సమచారం అబద్ధమని కొందరు కామెంట్లు చేశారు. మరికొందరు మాత్రం ఆ కుర్రాడి తెలివిని ప్రశంసిస్తున్నారు. ``అది పూర్తిగా అబద్ధం. కుంభమేళాలో ఉచిత మొబైల్స్ ఛార్జింగ్ సౌకర్యం ఉంది``, ``ఈ వీడియో ఫేక్``, ``అలా అయితే ఒక రోజులో లక్ష రూపాయలకు పైనే సంపాదించవచ్చు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Snake Viral Video: వామ్మో.. యముడికే సవాల్ విసురుతున్నాడుగా.. పాముతో ఎలాంటి ఆటలు ఆడుతున్నాడో చూడండి..
Harsh Goenka: రెండు నెలలు తేనె-నిమ్మకాయ నీరు తాగితే.. ఫలితం ఏంటో చెప్పిన హర్ష్ గోయెంకా..
Viral Video: ఓర్నీ.. పకోడీలకు ఇంత డిమాండా? ఎలా కొట్టుకుంటున్నారో చూడండి.. వీడియో వైరల్..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి