Share News

Snake Viral Video: వామ్మో.. యముడికే సవాల్ విసురుతున్నాడుగా.. పాముతో ఎలాంటి ఆటలు ఆడుతున్నాడో చూడండి..

ABN , Publish Date - Feb 12 , 2025 | 06:55 PM

విషపూరిత సర్పం కాటేస్తే నిమిషాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోవాల్సిందే. అయితే కొందరు మాత్రం పాములతో ధైర్యంగా వ్యవహరిస్తారు. పాములతో ప్రమాదకర ఆటలాడతారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత అలాంటి ఎన్నో వీడియోలు మన కళ్ల ముందుకు వచ్చాయి.

Snake Viral Video: వామ్మో.. యముడికే సవాల్ విసురుతున్నాడుగా.. పాముతో ఎలాంటి ఆటలు ఆడుతున్నాడో చూడండి..
snake viral Video

ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది పాములంటే (Snake) భయపడతారు. పాము ఉందని తెలిస్తే చాలు అటువైపు వెళ్లడానికి కూడా జంకుతారు. విషపూరిత సర్పం కాటేస్తే నిమిషాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోవాల్సిందే. అయితే కొందరు మాత్రం పాములతో ధైర్యంగా వ్యవహరిస్తారు. పాములతో ప్రమాదకర ఆటలాడతారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత అలాంటి ఎన్నో వీడియోలు మన కళ్ల ముందుకు వచ్చాయి (Snake Videos). తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు (Viral Videos).


memesbysukhraj అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి పాముతో ప్రమాదకర ఆటలాడుతున్నాడు. ఆ పామును తన మెడలో వేసుకున్నాడు. అంతేకాకుండా పాము నోటిని తన నోటిలో పెట్టుకున్నాడు. ఆ పాము నోరు తెరిచి ఆ వ్యక్తి పెదవిని గట్టిగా పట్టుకుంది. ఆ తర్వాత ఆ పామును తన మెడి నుంచి బయటకు తీసి నోటితో పట్టుకుని వేలాడదీశాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.


ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు పది లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. 73 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇతడికి యుముడితో మాట్లాడాలని చాలా తొందరగా ఉంది``, ``ఇతను పాములకు ఇమ్రాన్ హష్మిలాంటి వాడు``, ``ఆ పాము కోరలు తీసేసినట్టు ఉన్నారు``, ``పాముల జాతే ఇతడిని చూస్తే భయపడుతుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

Harsh Goenka: రెండు నెలలు తేనె-నిమ్మకాయ నీరు తాగితే.. ఫలితం ఏంటో చెప్పిన హర్ష్ గోయెంకా..


Optical Illusion: మీ కళ్లు సూపర్ పవర్‌ఫుల్ అయితేనే.. ఈ ఫొటోలో రెండో మనిషిని 10 సెకెన్లలో కనిపెట్టగలరు..


Viral Video: ఓర్నీ.. పకోడీలకు ఇంత డిమాండా? ఎలా కొట్టుకుంటున్నారో చూడండి.. వీడియో వైరల్..


Elephant Video: జేసీబీని ఎత్తి పడేసిన ఏనుగు.. తర్వాతేం జరిగిందో చూడండి.. వీడియో వైరల్..

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Feb 12 , 2025 | 06:55 PM