Viral News: ఇద్దరు పిల్లలున్న తల్లిని పెళ్లి చేసుకున్నాడు.. తర్వాత తల పట్టుకున్నాడు.. ఎందుకంటే..?
ABN , Publish Date - Feb 16 , 2025 | 05:24 PM
Viral News: భార్య అనారోగ్యంతో చనిపోయింది. తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి కోసం మరో వివాహం చేసుకున్నాడు. అది కూడా ఇద్దరు పిల్లలున్న మహిళను పెళ్లి చేసుకున్నాడు. తీరా వివాహం కాగానే..

తాను ఒకటి తలిస్తే.. దైవం ఒకటి తలచినట్లు అయింది ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన ఓ వ్యక్తికి. భార్య అనారోగ్యంతో చనిపోయింది. ముగ్గురు పిల్లలును పెంచి.. పెద్ద చేయాలంటే ఆడ తోడు అవసరం అనుకున్నాడు. 2024, డిసెంబర్ 11వ తేదీన.. ఇద్దరు పిల్లలు ఉన్న ఓ వివాహితను పెళ్లి చేసుకున్నాడు. కానీ వివాహం అయిన కొద్ది రోజులకే తన భార్య తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెను ఆసుపత్రికి తీసుకు వెళ్లాడు. మందులు వాడినా.. ఆమెకు జ్వరం తగ్గలేదు. దీంతో వైద్య చికిత్స కోసం ఆమెను పలు ఆసుపత్రులకు తీసుకు వెళ్లాడు.
చివరా ఆమెకు రక్త పరీక్షలు నిర్వహించాలంటూ వైద్యులు సూచించారు. దీంతో ఆమెకు రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ రక్త పరీక్షల్లో ఆమెకు ఎయిడ్స్ ఉందని నిర్ధారణ అయింది. అంతేకాదు.. ఈ వ్యాధి కూడా మూడో దశలో ఉందని తెలింది. దాంతో అతడు నిర్ఘాంత పోయాడు. అనంతరం ఆమెను వాళ్ల పుట్టింటిలో దిగబెట్టేందుకు తీసుకు వెళ్లాడు. ఆమె తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని వివరించాడు.
ఆమెను పుట్టింటిలో వదిలి వెళ్తానంటూ వారికి తెలియజేశాడు. దీంతో వారు ఆగ్రహం కట్టలు తెంచింది. ప్రాణాలు తీస్తామంటూ వారు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అతడు తీవ్ర భయాందోళనలకు గురయ్యాడు. ఆ తర్వాత.. అతడు మీరట్ పోలీసులను ఆశ్రయించాడు. జరిగిన విషయాన్ని వారికి వివరించాడు.
Also Read : సీఎం రేవంత్‌కి బీజేపీ ఎంపీ సవాల్
అంతేకాదు ఆమె చిన్న కుమార్తెకు సైతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోందని ఆమెకు సైతం వైద్య పరీక్షలు నిర్వహిస్తే.. ఇదే వ్యాధి ఆమెకు సైతం సొకిందంటూ అతడు వివరించారు.మరోవైపు వివాహం చేసుకునే ముందు జరిగిన చర్చల్లో ఆమెతోపాటు ఆమె పిల్లల ఆలనా పాలనా తానే చూసుకుంటానని స్పష్టం చేశానని.
Also Read : పద్ధతి మార్చుకోని యూఎస్.. కాళ్లకు, చేతులకు బేడీలు
కానీ ప్రస్తుత పరిస్థితులన్ని పూర్తిగా తారుమారు అయ్యాయని అతడు పోలీసుల ఎదుట వాపోయాడు. ఈ నేపథ్యంలో వారిని వదిలి.. తన మానాన తాను తన ముగ్గురుపిల్లలతోప్రశాంతంగా బతకాలని కోరుకుంటున్నట్లు అతడు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను నిద్రలేని రాత్రులు గడుపుతున్నాంటూ అతడు పోలీసుల ముందు ఆవేదన వ్యక్తం చేశాడు.
For National News and Telugu News