Viral: నన్ను తదేకంగా చూడటం నా భార్యకు ఇష్టమే.. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ చురక
ABN , Publish Date - Jan 12 , 2025 | 05:47 PM
ఉద్యోగులు ఆదివారాలూ చేయాలన్న ఎల్ అండ్ టీ చైర్మన్ సుబ్రమణియన్‌పై విమర్శల వెల్లువ కొనసాగుతోంది. తోటి కార్పొరేట్లు కూడా ఆయనపై చురకలంటిస్తు్న్నారు. ఈ జాబితాలో తాజా సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా వచ్చి చేరారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగులు ఆదివారాలు పనిచేయాలన్నది చాలక రోజంతా జీవితభాగస్వామినే చూస్తూ ఎవరుండగలరని ఎల్ అండ్ టీ చైర్మన్ సుబ్రమణియన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలనానికి దారి తీశాయి. సామాన్యులు ఆయనపై విమర్శలు ఎక్కుపెడుతుంటే కార్పొరేట్లు కూడా సోషల్ మీడియా వేదికగా చురకలు అంటించడం ప్రారంభించారు. తొలుత హర్ష గోయెంకా, ఆ తరువాత ఆనంద్ మహీంద్రా..ఇప్పుడు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా కూడా ఈ లిస్టులోకి వచ్చి చేశారు. ఎల్ అండ్ టీ చైర్మన్‌కు పరోక్షంగా చురకలంటిస్తూ పూనావాలా చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
‘‘యస్ ఆనంద్ మహీంద్రా గారూ.. నేను అద్భుతమైన వ్యక్తినని నా భార్య నటాషా పూనావాల కూడా భావిస్తుంది. ఆదివారాలు అలా నన్ను చూస్తూ గడిపేయగలదు. ఎంత సేపు కాదు.. ఎంత నైపుణ్యంతో పనిచేశామన్నదే ముఖ్యం’’ అని ఆయన కామెంట్ చేశారు. అంతేకాకుండా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అన్న హ్యాష్ ట్యాగ్‌ను కూడా జతచేశారు (Viral).
Viral: ఒంటరి మగాళ్లకు ఏఐ గర్ల్ ఫ్రెండ్! ధర చూస్తే షాక్ పక్కా!
అంతకుమునుపు ఓ సమావేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడుతూ ఎల్ అండ్ టీ చైర్మన్‌కు చురకలంటించారు. వారానికి 48, 70, 90 గంటలు పనిచేశామా లేదా అన్నది ముఖ్యం కాదు, ఎంత నాణ్యమైన పని చేశామన్నది ముఖ్యం. నా భార్య అద్భుతమైన వ్యక్తి. ఆమెను చూస్తూ నేను ఉండిపోగలను’’ అని అన్నారు.
అంతకుమునుపు ఆర్‌పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష గోయెంకా కూడా వారానికి 90 గంటలు పనిచేయాలన్న సూచనను తోసి పుచ్చారు. ఇది సక్సెస్‌కు సూత్రం కాదని, అలసటకు మాత్రమేనని స్పష్టం చేశారు. ‘‘సన్‌డే పేరును సన్ డ్యూటీగా పేరు మారిస్తే పోలా’’ అని సెటైర్ పేల్చారు. ఇక మాజీ బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా కూడా సుబ్రమణియన్ వ్యాఖ్యలపై ఫైరయ్యారు. ఆయన కామెంట్స్‌లో స్త్రీ ద్వేషం కనిపిస్తోందని అన్నారు.
Viral: లాస్ ఏంజిలిస్ కార్చిచ్చు.. లాటరీ సొమ్ముతో కొన్న ఇల్లు బుగ్గిపాలు!
ఇతర దేశాలతో భారత్ పోటీ పడాలంటే ఇక్కడి యువత వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి సూచించడంతో ‘వర్క్ లైఫ్ బ్యాలెన్స్’ వివాదం మొదలైన విషయం తెలిసిందే. ఇక తోటి కార్పొరేట్ బాస్‌ల నుంచి కూడా విమర్శలు వస్తాయని ఎల్ అండ్ టీ చైర్మన్ అస్సలు ఊహించి ఉండరంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.
Viral: తన తండ్రికి ఉద్యోగం కోరుతూ యువతి అభ్యర్థన .. నెట్టింట ప్రశంసల వెల్లువ