Share News

Viral: నా సీటు పైలట్‌కు ఇస్తారా? ఎయిర్ ఇండియాపై ప్రయాణికుడి గుస్సా..

ABN , Publish Date - Jan 16 , 2025 | 11:43 PM

తనకు కేటాయించిన బిజినెస్ క్లాస్ సీటును చివరి నిమిషంలో పైలట్‌కు కేటాయించడంపై అభ్యంతరం చెబుతూ ఎయిర్ ఇండియా ప్రయాణికుడు నెట్టింట పెట్టిన పోస్టు తెగ వైరల్ అవుతోంది.

Viral: నా సీటు పైలట్‌కు ఇస్తారా? ఎయిర్ ఇండియాపై ప్రయాణికుడి గుస్సా..

ఇంటర్నెట్ డెస్క్: తనకు కేటాయించిన బిజినెస్ క్లాసు సీటును పైలట్‌కు బదిలీ చేశారంటూ ఓ ప్రయాణికుడు ఎయిర్ ఇండియాపై నెట్టింట ఫైరైపోయాడు. ఇది అన్యాయమంటూ వాపోయాడు. ఇందుకు సంబంధించిన ఉదంతం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. అనేక మంది అతడికి అండగా నిలిస్తే కొందరు నెటిజన్లు మాత్రం పైలట్లకు సీటు బదిలీ చేయడంలో తప్పేమీ లేదని వాపోయారు (Viral).

న్యూఢిల్లీలో ఈ ఘటన వెలుగు చూసింది. ‘‘ఎయిర్ ఇండియా ఫ్లైట్‌ ఏఐ - 2055లో నా సీటును బిజినెస్ క్లాసు నుంచి ఎకానమీకి డౌన గ్రేడ్ చేశారు. ఆ తరువాత ఆ బిజినెస్ క్లాసు నీటును ఓ ఎయిర్ ఇండియా పైలట్‌కు ఇచ్చారు. సీట్లు ఖాళీగా ఉన్నాయంటూ నన్ను, నా నాలుగేళ్ల కొడుకును గంటన్నర పాటు వేచి చూసేలా చేసి చివరకు ఇలా చేశారు. సీటు కోసం డబ్బులు చెల్లించిన కస్టమర్ కంటే విమాన పైలట్‌ సంస్థకు ఎక్కువగా అని బన్సల్ అనే వ్యక్తి ప్రశ్నించాడు.


Viral: పసిబిడ్డతో విమాన ప్రయాణం! టేకాఫ్‌లో జాప్యం జరగడంతో..

ఈ పోస్టు క్షణాల్లో వైరల్ అయిపోయింది. భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎయిర్ ఇండియా సదరు ప్రయాణికుడి పట్ల అన్యాయంగా వ్యవహరించిందని కొందరు అన్నారు. ఇది బాధ్యతా రాహిత్యమని ఖండించారు. మరికొందరేమో పైలట్‌కు సీటు కేటాయించడంలో తప్పేమీ లేదని అన్నారు. పైలట్లు సరిగా రెస్టు తీసుకుంటేనే విమాన ప్రమాదాలు జరగవని అన్నారు.


Viral: ఒంటరి మగాళ్లకు ఏఐ గర్ల్ ఫ్రెండ్! ధర చూస్తే షాక్ పక్కా!

మరికొందరేమో పైలట్లకు సీటు బదిలీ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పైలట్లకు రెస్టు ముఖ్యమని తెలిసి సంస్థ ముందుస్తుగా వారికి సీటు ఎందుకు రెడీ చేసి పెట్టుకోలేదని ప్రశ్నించారు. డబ్బులు చెల్లించి ప్రయాణికుడి సీటును తీసేసుకోవడంలో ఔచిత్యం ఏమిటని ప్రశ్నించారు. ఇలా అత్యంత బాధ్యతారాహిత్యమని సదరు ప్రయాణికుడు తక్షణం కన్జూమర్ ఫోరంకు ఫిర్యాదు చేయాలని కొందరు సూచించారు. అయితే, ఈ ఘటనపై ఎయిర్‌లైన్స్ ఇంకా స్పందించాల్సి ఉంది.

కాగా, ఇటీవల మరో ప్రయాణికుడు కూడా స్పైస్ జెట్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. విమానయాన సంస్థ ప్రణాళికా లోపం కారణంగా టేకాఫ్ ఆలస్యమైనందుకు తాను తన పసిబిడ్డతో రెండు గంటల పాటు విమానంలోని ఉండిపోవాల్సి వచ్చిందని వాపోయాడు. టేకాఫ్‌కు అనుమతి లేకుండానే ప్రయాణికులను ముందుగానే బోర్డింగ్‌కు ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు.

Viral: నన్ను తదేకంగా చూడటం నా భార్యకు ఇష్టమే.. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ చురక

Read Latest and Viral News

Updated Date - Jan 16 , 2025 | 11:43 PM