Dangerous Stunt Video: వీళ్లను చూసి ప్రమాదమే పక్కకు తప్పుకుంటుందేమో.. వీడియో చూస్తే భయపడాల్సిందే..
ABN , Publish Date - Feb 25 , 2025 | 04:42 PM
సోషల్ మీడియాలో ఎప్పుడు, ఏది వైరల్ అవుతుందో చెప్పడం కష్టం. ముఖ్యంగా ప్రమాదకర పనులు చేసే వారికి సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. కొందరు వీడియోల కోసం ప్రమాదకర పనులు చేస్తుండగా, మరికొందరు తమ వృత్తిలో భాగంగా ప్రమాదకర పరిస్థితిలో పని చేస్తుంటారు.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆసక్తికరంగా ఉండి చూసే వారిని ఆకట్టుకుంటున్నాయి. సోషల్ మీడియాలో ఎప్పుడు, ఏది వైరల్ అవుతుందో చెప్పడం కష్టం. ముఖ్యంగా ప్రమాదకర పనులు చేసే వారికి సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. కొందరు వీడియోల కోసం ప్రమాదకర పనులు (Dangerous Stunts) చేస్తుండగా, మరికొందరు తమ వృత్తిలో భాగంగా ప్రమాదకర పరిస్థితిలో పని చేస్తుంటారు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).
just_crazy_thingss అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. కొందరు కార్మికులు (Workers) బ్రిడ్జ్ నిర్మాణం కోసమో, బిల్డింగ్ నిర్మాణం కోసమో స్టీల్ రాడ్లతో ఎత్తైన నిర్మాణం చేస్తున్నారు. ఆ సమయంలో వారు ఎలాంటి రక్షణ లేకుండా అత్యంత ప్రమాదకరంగా ఆ స్టీల్ రాడ్ల మీద నడుస్తున్నారు. కొన్ని రాడ్లను తమ భుజాలపై వేసుకుని ఏమాత్రం రక్షణ లేని ఆ నిర్మాణంపై నడుస్తున్నారు. అక్కడి నుంచి ఏమాత్రం జారిపడినా తీవ్ర గాయాలపాలు కావడం మాత్రం తథ్యం. వారి స్టంట్లను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను వేల మంది వీక్షించారు. వందల మంది లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``వీళ్లను చూస్తే ప్రమాదమే ప్రమాదంలో పడుతుంది``, ``ఇది నిజంగా భయంకరం``, ``సంపాదన కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నారు``, ``పేదవాళ్ల ప్రాణాలకు భద్రత లేదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Optical Illusion: మీ చూపు షార్ప్ అయితే.. ఈ పిల్లుల మధ్యనున్న ఎలుకను 5 సెకెన్లలో కనుగొనండి..
Optical Illusion: మీ కళ్లు చురుకైనవి అయితే.. ఈ ఫొటోలో ``HOT`` పదాన్ని 5 సెకెన్లలో కనుగొనండి..
Rooster: కోడి నా జీవితంలో ప్రశాంతత లేకుండా చేస్తోంది.. కేరళ వాసి ఫిర్యాదుపై అధికారులు ఏం చేశారంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి