Share News

Satwik-Chirag : దృష్టంతా సాత్విక్‌ జోడీపైనే!

ABN , Publish Date - Jan 07 , 2025 | 05:02 AM

భారత స్టార్‌ డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టి మంగళవారం నుంచి జరిగే మలేసియా ఓపెన్‌తో కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించాలనుకొంటోంది. లక్ష్యసేన్‌, బ్రేక్‌ తర్వాత బరిలోకి దిగుతున్న హెచ్‌ఎ్‌స ప్రణయ్‌ అదిరే

 Satwik-Chirag : దృష్టంతా సాత్విక్‌ జోడీపైనే!

నేటి నుంచి మలేసియా ఓపెన్‌

కౌలాలంపూర్‌: భారత స్టార్‌ డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టి మంగళవారం నుంచి జరిగే మలేసియా ఓపెన్‌తో కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించాలనుకొంటోంది. లక్ష్యసేన్‌, బ్రేక్‌ తర్వాత బరిలోకి దిగుతున్న హెచ్‌ఎ్‌స ప్రణయ్‌ అదిరే ప్రదర్శనపై గురిపెట్టారు. తొలి రౌండ్‌లో తైపీకి చెందిన మింగ్‌ చె లు-టాంగ్‌ కై వితో సాత్విక్‌ జోడీ తలపడనుంది. పురుషుల సింగిల్స్‌లో చి యు జెన్‌ (చైనీస్‌ తైపీ)తో లక్ష్య సేన్‌, బ్రియాన్‌ అయాంగ్‌ (కెనడా)తో ప్రణయ్‌ ఆడనున్నారు. ఇటీవలే వివాహం చేసుకొన్న పీవీ సింధు టోర్నీకి దూరం కాగా.. మహిళల సింగిల్స్‌లో ఆకర్షి, మాళవిక, అనుపమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. డబుల్స్‌లో ట్రీసా జాలీ-గాయత్రీ, రుతుపర్ణ-శ్వేతపర్ణ, మిక్స్‌డ్‌లో తనీషా-ధ్రువ్‌ కపిల జంటలు బరిలోకి దిగనున్నాయి.

Updated Date - Jan 07 , 2025 | 05:02 AM