IPL 2025 : ఐపీఎల్ మార్చి 22 నుంచి?
ABN , Publish Date - Feb 15 , 2025 | 05:58 AM
ఈ సీజన్ ఐపీఎల్ షెడ్యూల్‌ను పాలక మండలి ఖరారు చేసినట్టు తెలిసింది. కీలక మ్యాచ్‌లకు సంబంధించిన వివరాలను ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలకు బీసీసీఐ పంపినట్టు సమాచారం. త్వరలో

మే 25న ఫైనల్!
తొలి పోరులో కోల్‌కతా X బెంగళూరు ఢీ
న్యూఢిల్లీ: ఈ సీజన్ ఐపీఎల్ షెడ్యూల్‌ను పాలక మండలి ఖరారు చేసినట్టు తెలిసింది. కీలక మ్యాచ్‌లకు సంబంధించిన వివరాలను ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలకు బీసీసీఐ పంపినట్టు సమాచారం. త్వరలో పూర్తి వివరాలను వెల్లడించనుంది. ఖరారైన షెడ్యూల్ ప్రకారం..మార్చి 22న ఐపీఎల్ మొదలవనుంది. తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా, బెంగళూరు మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో జరగ నుంది. మరుసటిరోజు (మార్చి 23న) హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను రాజస్థాన్‌ను ఢీకొననుంది. ఫైనల్ పోరు మే 25న ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. క్వాలిఫయర్-1, ఎలిమినేటర్‌కు హైదరాబాద్, క్వాలిఫయర్-2కు కోల్‌కతా ఆతిథ్యమివ్వనున్నాయి.