Sediqullah Atal: ఆసీస్‌ను భయపెట్టిన ఆఫ్ఘాన్ బ్యాటర్.. ఈ నాక్ శానా యేండ్లు యాదుంటది
ABN , Publish Date - Feb 28 , 2025 | 06:14 PM
AFG vs AUS: ఆస్ట్రేలియా జట్టును ఓ చిచ్చరపిడుగు భయపెట్టాడు. మెమరబుల్ నాక్‌తో వణికించాడు. మంచి బంతుల్ని కూడా భారీ షాట్లుగా మలుస్తూ శానా యేండ్లు యాదుండే ఇన్నింగ్స్ ఆడాడు. ఎవరా బ్యాటర్? అనేది ఇప్పుడు చూద్దాం..

డూ ఆర్ డై మ్యాచుల్లో ఆస్ట్రేలియా జట్టు చెలరేగి ఆడుతుంది. ప్రత్యర్థులకు ఎక్కడా కోలుకునే అవకాశం ఇవ్వకుండా చావుదెబ్బ తీస్తూ పోతుంది. ముఖ్యంగా కంగారూ బౌలర్లు స్టన్నింగ్ స్పెల్స్‌తో అపోజిషన్ టీమ్‌ను లేవకుండా చేస్తారు. తక్కువ పరుగులకే కట్టడి చేసి మ్యాచ్‌ను గుప్పిట్లోకి తీసుకుంటారు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆఫ్ఘానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ అదే రిపీట్ అయింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘాన్‌ను ఆసీస్ బౌలర్లు భయపెట్టారు. ఆరంభంలో వికెట్లు తీయడమే గాక ప్రతి పరుగు కోసం చెమటోడ్చేలా చేశారు. అయితే 23 ఏళ్ల ఓ కుర్ర బ్యాటర్ వాళ్లకు సైంధవుడిలా అడ్డుపడ్డాడు. ఎవరా ఆటగాడు? అనేది ఇప్పుడు చూద్దాం..
వీరోచిత పోరాటం
సెమీస్‌కు చేరాలంటే చావోరేవోగా మారిన మ్యాచ్‌లో ఆసీస్ జోరును తట్టుకొని నిలబడింది ఆఫ్ఘాన్. ఒకదశలో 91 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో ఆ జట్టు 240 కంటే ఎక్కువ స్కోర్ చేయలేదేమో అనుకున్నారు. కానీ కుర్ర బ్యాటర్ సెదీఖుల్లా అటల్ (95 బంతుల్లో 85) భలే పోరాటం చేశాడు. 6 బౌండరీలు, 3 సిక్సులు కొట్టిన అతడు కంగారూ బౌలర్లకు ఎదురొడ్డి వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. గత మ్యాచ్ సెంచరీ హీరో ఇబ్రహీం జాద్రాన్ (22), రెహ్మానుల్లా గుర్బాజ్ (0), రెహ్మత్ షా (12), సారథి హష్మతుల్లా షాహిదీ (20) లాంటి స్టార్లంతా పెవిలియన్ చేరినా అతడు ఒంటరి పోరాటం చేశాడు. సింగిల్స్, డబుల్స్‌తో స్ట్రైక్ రొటేషన్ చేస్తూనే వీలు కుదిరినప్పుడల్లా భారీ షాట్లు బాదాడు అటల్. ఆఫ్ఘాన్ 273 పరుగుల మార్క్ వరకు వెళ్లగలిగిందంటే అందుకు సెదీఖుల్లా వేసిన పునాది ప్రధాన కారణమని చెప్పొచ్చు.
ఇవీ చదవండి:
ఒకడేమో దారుణశస్త్రం.. ఒకడేమో మారణశాస్త్రం..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి