Share News

Virat Kohli: ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. కోహ్లీని కావాలనే ఆడించలేదా.. కారణం ఏంటి

ABN , Publish Date - Feb 06 , 2025 | 03:18 PM

IND vs ENG: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా మేనేజ్‌మెంట్ అందరికీ షాక్ ఇచ్చింది. టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీని తుదిజట్టులోకి తీసుకోలేదు. దీంతో అతడ్ని ఎందుకు ఆడించలేదనే డిస్కషన్స్ నడుస్తున్నాయి.

Virat Kohli: ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. కోహ్లీని కావాలనే ఆడించలేదా.. కారణం ఏంటి
Virat Kohli

భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి వన్డే మొదలైంది. నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లీష్ టీమ్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగలేదు. భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో అతడి పేరు కనిపించలేదు. దీంతో ఫిట్‌గా ఉన్నా అతడ్ని ఎందుకు ఆడించలేదనే డిస్కషన్స్ మొదలయ్యాయి. నిన్న మొన్ననే రంజీలు ఆడినోడికి ఇంతలో ఏమైందని అంతా ఆశ్చర్యపోతున్నారు. అతడ్ని కావాలనే ఆడించలేదా? అసలు సారథి రోహిత్-కోచ్ గంభీర్ ప్లాన్ ఏంటి? అని ఆలోచిస్తున్నారు. మరి.. అసలు విరాట్ ఆడకపోవడానికి రీజన్ ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..


రోహిత్ ఏమన్నాడంటే..!

మోకాలి నొప్పు కారణంగా కోహ్లీ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. టాస్ సమయంలో జట్టును ప్రకటించిన హిట్‌మ్యాన్.. విరాట్ ఈ మ్యాచ్‌లో ఆడట్లేదని క్లారిటీ ఇచ్చాడు. కుడి మోకాలు నొప్పిగా ఉండటంతో అతడికి రెస్ట్ ఇచ్చామని చెప్పాడు. కోహ్లీ స్థానంలో యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ను రీప్లేస్ చేశామని పేర్కొన్నాడు. అయితే నిన్న మొన్నటి వరకు ఫిట్‌గా ఉన్న కోహ్లీ ప్రాక్టీస్ సెషన్స్‌లో జోరుగా బ్యాటింగ్ సాధన చేస్తూ కనిపించాడు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరి.. అతడికి మ్యాచ్‌కు ముందు గాయమైందా? లేదా నిన్న నెట్ సెషన్‌లో మోకాలికి దెబ్బ తగిలిందా? అనేది క్లారిటీ లేదు. ఈ మ్యాచ్‌లో ఆడని కోహ్లీ.. రెండో వన్డేకల్లా కోలుకుంటాడేమో చూడాలి.


ఇవీ చదవండి:

తెలుగోళ్ల ప్రేమకు కేన్ మామ ఫిదా.. ఆ పేరు అదిరిపోయిందంటూ..

కివీస్‌కు కాళరాత్రి.. సచిన్ శివతాండవం.. ఈ ఇన్నింగ్స్‌ గుర్తుందా

‘చాంపియన్స్‌’కు ముందు భలే చాన్స్‌!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 06 , 2025 | 03:18 PM

News Hub