Share News

IPL 2025 Match Prediction: ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్.. టోర్నీ ఓపెనర్‌లో గెలుపెవరిది

ABN , Publish Date - Mar 22 , 2025 | 10:08 AM

RCB vs KKR Match Prediction: ఐపీఎల్-2025 మహా సంగ్రామం మరికొన్ని గంటల్లో మొదలుకానుంది. క్యాష్ రిచ్ లీగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు మొదలైపోయాయి. ఇవాళ జరిగే తొలి పోరులో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి ఆర్సీబీ-కేకేఆర్.

IPL 2025 Match Prediction: ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్.. టోర్నీ ఓపెనర్‌లో గెలుపెవరిది
IPL 2025

అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. చాంపియన్స్ ట్రోఫీ గెలుపు సంబురాలు ముగియక ముందే ఫ్యాన్స్‌ను మరింత ఎంటర్‌టైన్ చేసేందుకు ఐపీఎల్-2025 వచ్చేసింది. ఈ లీగ్ కోసం క్రికెట్ లవర్స్‌తో పాటు నార్మల్ ఆడియెన్స్ కూడా చాన్నాళ్లుగా వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు ఆ ఉత్కంఠకు ఇవాళ్టితో బ్రేక్ పడనుంది. ఈ రోజు జరిగే టోర్నీ ఓపెనర్‌లో నిరుటి విజేత కోల్‌కతా నైట్ రైడర్స్, హాట్ ఫేవరెట్లలో ఒకటైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు పోటీ పడనున్నాయి. ఈ నేపథ్యంలో ఫస్ట్ ఫైట్‌లో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. ఎవరి బలాబలాలు ఎలా ఉన్నాయి.. రికార్డులు ఏం చెబుతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం..


పిచ్ రిపోర్ట్

ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ మార్చి 22 సాయంత్రం 7.30 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్‌కు కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. ఈ పిచ్ మామూలుగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. గత ఐపీఎల్‌లో ఇక్కడ 200 ప్లస్ స్కోర్లు కూడా ఈజీగా కొట్టేశారు.

బలాబలాలు

కేకేఆర్: డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న కోల్‌కతా గత సీజన్‌లో అద్భుతంగా రాణించింది. ఫైనల్స్‌కు వెళ్లి కప్పు ఎగరేసుకుపోయింది. సునీల్ నరైన్, ఆంద్రే రస్సెల్ లాంటి క్వాలిటీ ఆల్‌రౌండర్లు కేకేఆర్‌లో ఉన్నారు. వీళ్లకు తోడు వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్ రూపంలో పించ్ హిట్టర్లు ఉన్నారు. బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి వాళ్లకు ఎక్స్‌ ఫ్యాక్టర్ అనే చెప్పాలి. టీమ్‌ను కూల్‌గా నడిపించే అజింక్యా రహానె ఎలాగూ ఉన్నాడు.


ఆర్సీబీ: గత సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరుకున్న బెంగళూరు.. తొలి కప్పును మాత్రం అందుకోలేకపోయింది. ఈసారి ఆ టీమ్ మంచి బ్యాలెన్స్‌తో కనిపిస్తోంది. కోహ్లీ, సాల్ట్, లివింగ్‌స్టన్‌తో బ్యాటింగ్ యూనిట్ దుర్భేద్యంగా ఉంది. హేజల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో కీలకంగా మారనున్నారు.

బలహీనతలు

కేకేఆర్‌: హర్షిత్ రానా, వైభవ్ అరోరా, స్పెన్సర్ జాన్సన్ రూపంలో మంచి యంగ్ పేస్ యూనిట్ అందుబాటులో ఉంది. కానీ ఎక్స్‌పీరియెన్స్‌డ్ పేసర్లు లేరు. ఒకవేళ ఆర్సీబీ బ్యాటర్లు ఆరంభం నుంచే హిట్టింగ్ మొదలుపెడితే కో‌ల్‌కతా బౌలర్లు డిఫెన్స్‌లో పడే అవకాశం ఉంది. అటు బ్యాటింగ్‌లో మిడిలార్డర్‌లో వెంకీ అయ్యర్, రింకూ ఎంత వరకు స్థిరత్వం చూపుతారనేది కీలకం. సేమ్ టైమ్ ఒకప్పటి లెవల్‌లో నరైన్-రస్సెల్ ఆడగలరా అనేది మరో డౌట్. కొత్త కెప్టెన్ రహానె టీమ్ కాంబినేషన్‌ను ఎంత వరకు సెట్ చేయగలడు.. ప్రెజర్ టైమ్స్‌లో టీమ్‌ను ఎలా నడుపుతాడనేది కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది.


ఆర్సీబీ: బెంగళూరుకు ఉన్న ప్రధాన సమస్య స్పిన్ బౌలింగ్. కృనాల్ పాండ్యా వేగంగా విసిరి వేయడం తప్పితే బాల్‌ను అంతగా టర్న్ చేయడు. సుయాష్ శర్మ నుంచి ప్రతిసారి బ్రేక్‌త్రూలు ఆశించలేం. వీళ్లు నిలకడగా వికెట్లు తీసిన సందర్భాలు కూడా లేవు. డెత్ ఓవర్లలో భువనేశ్వర్-హేజల్‌వుడ్ ఎంత సమర్థంగా బౌలింగ్ చేస్తారో కూడా అనుమానమే. అటు బ్యాటింగ్‌లో కోహ్లీ, లివింగ్‌స్టన్, సాల్ట్, పటిదార్ రూపంలో స్ట్రాంగ్ యూనిట్ ఉన్నా.. వీళ్లు ఫెయిలైతే మిడిలార్డర్‌లో జట్టును ఆదుకునే వారు కనిపించడం లేదు.

హెడ్ టు హెడ్

ఈ రెండు జట్లు తలపడిన గత 5 మ్యాచుల్లో కేకేఆర్ 4 సార్లు గెలిచింది. అందునా సొంత మైదానమైన ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ రికార్డు బలంగా ఉంది.

విన్నర్ ప్రిడిక్షన్

బలాబలాలు, రికార్డులు, హెడ్ టు హెడ్, హోమ్ అడ్వాంటేజ్, స్పిన్ ఎటాక్‌ను బట్టి చూస్తే ఈ మ్యాచ్‌లో కోల్‌కతా గెలవడం ఖాయం.


ఇవీ చదవండి:

చాలెంజర్‌ ట్రోఫీకి ఏడుగురు తెలుగోళ్లు

ఈడెన్‌లో డాన్ ఎవరు

హసన్‌ రికార్డు సెంచరీ

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 22 , 2025 | 12:11 PM