IND vs BAN: బంగ్లా బ్యాటర్ సెంచరీ.. మనోడు కాకపోయినా మెచ్చుకోవాల్సిందే
ABN , Publish Date - Feb 20 , 2025 | 06:21 PM
Towhid Hridoy: బంగ్లాదేశ్ బ్యాటర్ తౌహిద్ హృదయ్ ఫెంటాస్టిక్ నాక్‌తో అలరించాడు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తౌహిద్ సూపర్ సెంచరీతో మెరిశాడు. అతడి ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుందనే చెప్పాలి.

బంగ్లాదేశ్ బ్యాటర్ తౌహిద్ హృదయ్ క్రికెట్ లవర్స్ మనసులు గెలుచుకున్నాడు. దుబాయ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో అతడు సూపర్ సెంచరీతో మెరిశాడు. చాంపియన్స్ ట్రోఫీ లాంటి బడా టోర్నమెంట్, ఎదురుగా భారత్ లాంటి టాప్ టీమ్, 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టైమ్‌లో అతడి నుంచి వచ్చిన ఈ ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుందనే చెప్పాలి. 114 బంతుల్లో 100 పరుగులతో అదరగొట్టాడు హృదయ్. బౌండరీలు, సిక్సుల జోలికి ఎక్కువగా పోకుండా కామ్‌గా, కూల్‌గా బ్యాటింగ్ చేశాడు.
గోడ కట్టేశారు!
టీమ్‌ను ఆపద నుంచి బయటపడేయడానికి హృదయ్ ఆఖరి వరకు ప్రయత్నించాడు. అతడితో పాటు జేకర్ అలీ (114 బంతుల్లో 68) కూడా చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. బంతులతో నిప్పులు చెరుగుతున్న భారత బౌలర్లను తట్టుకొని సింగిల్స్, డబుల్స్‌తో బండి నడిపించారు. వికెట్లకు గోడ కట్టేశారు. జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించడమే లక్ష్యంగా బ్యాటింగ్ చేశారు. ఇద్దరూ కలసి 10 బౌండరీలు, 2 సిక్సులు మాత్రమే కొట్టారు. స్ట్రైక్ రొటేషన్‌తో భారత బౌలర్లను విసిగించారు. అలీ ఔట్ అయినా తౌహిద్ మాత్రం ఆఖరి వరకు పట్టువిడవకుండా క్రీజులో నాటౌట్‌గా నిలబడ్డాడు. అందుకే ప్రత్యర్థి ఆటగాడు అయినా సరే అతడి పట్టుదల, తెగింపును మెచ్చుకోవాల్సిందే. కాగా, బంగ్లా 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌట్ అయింది. మరి.. కష్టసాధ్యం కాని లక్ష్యాన్ని భారత్ ఎలా అందుకుంటుందో చూడాలి.
ఇవీ చదవండి:
అల్లు అర్జున్‌ను దించేసిన బంగ్లాదేశ్ బ్యాటర్
సారీ చెప్పిన రోహిత్.. చేతులు జోడించి..
గెలవాలంటే అదొక్కటే మార్గం అంటున్న అక్తర్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి