Virat Kohli: కోహ్లీ సంచలన నిర్ణయం.. 12 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైమ్..
ABN , Publish Date - Jan 09 , 2025 | 02:19 PM
టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో అతడు విఫలమయ్యాడు. టెస్టుల్లోనే కాదు.. వన్డేల్లోనూ అతడు బ్యాటింగ్‌లో అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న తరుణంలో విరాట్ కీలక నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది.
టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో అతడు విఫలమయ్యాడు. బ్యాక్ టు బ్యాక్ 9 ఇన్నింగ్స్‌ల్లో ఒకే తరహాలో ఔట్ అయ్యాడు. ఆఫ్ స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బంతుల్ని వెంటాడి వికెట్ పారేసుకున్నాడు. వచ్చాడు.. ఔట్ అయ్యాడు.. వెళ్లాడు అన్నట్లు అతడి బ్యాటింగ్ సాగింది. టెస్టుల్లోనే కాదు.. ఈ మధ్య కాలంలో వన్డేల్లోనూ అతడు బ్యాటింగ్‌లో అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. దీంతో అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కింగ్ పనైపోయింది.. అతడి ప్లేస్‌లో యంగ్ బ్యాటర్స్‌కు చాన్స్ ఇస్తే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో విరాట్ సంచలన నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. ఆ డెసిషన్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
ఢిల్లీ తరఫున బరిలోకి..!
ఫామ్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కోహ్లీ కీలక నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. 12 ఏళ్ల తర్వాత మళ్లీ దేశవాళీ క్రికెట్‌లో ఆడాలని ఫిక్స్ అయ్యాడని సమాచారం. వచ్చే నెల ఆరంభంలో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఆడనుంది టీమిండియా. అదే నెలలో ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ మొదలవనుంది. దీంతో తన ఫామ్, ఫిట్‌నెస్, టెక్నిక్‌ను సానబెట్టుకోవాలని కోహ్లీ డిసైడ్ అయ్యాడని తెలుస్తోంది. ఇందులో భాగంగానే దేశవాళీ క్రికెట్‌లో ఆడాలని ఫిక్స్ అయ్యాడని సమాచారం. తన సొంత జట్టు ఢిల్లీ తరఫున బరిలోకి దిగాలని అనుకుంటున్నాడట. ఫామ్ మెరుగుపర్చుకొని ఇంటర్నేషనల్ క్రికెట్‌లో రఫ్ఫాడించాలని భావిస్తున్నాడట.
విరాట్ బాటలో రోహిత్!
సాధారణంగా భారత్‌కు ఆడే ఆటగాళ్లు ఫామ్ కోల్పోతే దేశవాళీ క్రికెట్‌కు తిరిగొచ్చేవారు. డొమెస్టిక్ టోర్నీల్లో ఆడుతూనే విదేశాల్లో క్లబ్ క్రికెట్, కౌంటీ క్రికెట్ కూడా ఆడేవారు. అయితే గత దశాబ్ద కాలంలో భారత క్రికెట్‌లో ఇది తగ్గిపోయింది. అజింక్యా రహానె, ఛటేశ్వర్ పుజారా, భువనేశ్వర్ కుమార్, వృద్ధిమాన్ సాహా లాంటి కొందరు స్టార్లు మాత్రమే దేశవాళీల్లో ఆడుతూ వచ్చారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి టాప్ క్రికెటర్స్ మాత్రం డొమెస్టిక్ క్రికెట్‌కు దూరంగా ఉన్నారు. అయితే ఫామ్ కోల్పోవడం, తీవ్ర విమర్శలకు గురవడం, కెరీర్ ప్రమాదంలో పడిన నేపథ్యంలో కోహ్లీ తిరిగి ఢిల్లీకి ఆడాలని నిర్ణయించుకున్నాడట. ఒకవేళ అదే జరిగితే రోహిత్ కూడా ముంబై వెళ్లొచ్చు. వీళ్లిద్దరూ ఆడితే దేశవాళీ ప్లేయర్లకు ఈ మోడర్న్ లెజెండ్స్ నుంచి ఎంతో నేర్చుకునే అవకాశం కూడా వస్తుంది.
ఇవీ చదవండి:
బుమ్రా ఇంజ్యురీపై అప్‌డేట్.. చాంపియన్స్ ట్రోఫీలో ఆడతాడా..
నాకు అక్కర్లేదు.. డివోర్స్ రూమర్స్‌పై ధనశ్రీ ఇన్‌స్టా పోస్ట్
ఆఫ్ఘానిస్థాన్ టీమ్‌పై బ్యాన్.. పంతం పట్టి చేశారుగా..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి