Share News

Virat Kohli: పాత గాయాన్ని మళ్లీ గెలికిన కోహ్లీ.. ఆసీస్‌కు ఆనందం లేకుండా చేశాడు

ABN , Publish Date - Jan 05 , 2025 | 04:21 PM

IND vs AUS: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పాత గాయాన్ని మళ్లీ గెలికాడు. ఆస్ట్రేలియాను టార్గెట్ చేసి ఏడిపించాడు. చేతులతో సిగ్నల్స్ ఇస్తూ వాళ్ల ఈగోను హర్ట్ చేశాడు. అసలు ఏమైంది? అనేది ఇప్పుడు చూద్దాం..

Virat Kohli: పాత గాయాన్ని మళ్లీ గెలికిన కోహ్లీ.. ఆసీస్‌కు ఆనందం లేకుండా చేశాడు
Virat Kohli

ఆస్ట్రేలియా జట్టు అనుకున్నది సాధించింది. 10 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. 5 టెస్టుల ఈ సిరీస్‌ను 3-1తో గెలుచుకుంది. సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. ఏళ్ల నిరీక్షణకు తెరపడటంతో కంగారూ ఆటగాళ్లు ఫుల్లుగా సెలబ్రేట్ చేసుకున్నారు. ట్రోఫీని చేతబట్టి ఎంజాయ్ చేశారు. సాధించామంటూ సంబురాల్లో మునిగిపోయారు. అయితే సెలబ్రేషన్ మూడ్‌లో ఉన్న ఆసీస్‌ను రెచ్చగొట్టాడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. పాత గాయాన్ని మళ్లీ గెలికాడు. ఆస్ట్రేలియాను టార్గెట్ చేసి ఏడిపించాడు. చేతులతో సిగ్నల్స్ ఇస్తూ వాళ్ల ఈగోను హర్ట్ చేశాడు. దీంతో సిరీస్ గెలిచినా ఆ టీమ్‌కు సంతోషం లేకుండా పోయింది. అసలు ఏమైంది? అనేది ఇప్పుడు చూద్దాం..


మాయని మచ్చ!

శాండ్‌పేపర్ స్కాండల్.. ఆస్ట్రేలియా జట్టు చరిత్రలో మాయని మచ్చగా మారిన వివాదంగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. దీన్ని మరోసారి గుర్తుచేశాడు కోహ్లీ. సిడ్నీ టెస్ట్ ఆసీస్ రెండో ఇన్నింగ్స్ సమయంలో 11వ ఓవర్‌లో విరాట్‌ను కంగారూ ఫ్యాన్స్ తెగ ఇబ్బంది పెట్టసాగారు. మ్యాచ్ తమదే.. భారత్ ఓడిపోతోందంటూ ఎగతాళి చేశారు. అంతే కోహ్లీ పట్టరాని కోపంతో సీరియస్ అయ్యాడు. శాండ్‌పేపర్ స్కాండల్‌ను వాళ్లకు గుర్తుచేస్తూ వెక్కిరించాడు. తన జేబులో ఎలాంటి శాండ్‌పేపర్ లేదంటూ కంగారూలకు ఇచ్చిపడేశాడు. దీంతో అసలు శాండ్‌పేపర్ స్కాండల్ ఏంటి? అంటూ తెలుసుకునే పనిలో పడ్డారు అభిమానులు.


ఏంటీ శాండ్‌పేపర్ గేట్?

2018లో క్రికెట్ ఆస్ట్రేలియాను శాండ్‌పేపర్ స్కాండల్ కుదిపేసింది. సౌతాఫ్రికాతో కేప్‌టౌన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ శాండ్‌పేపర్‌తో అడ్డంగా బుక్కయ్యారు. బంతి మరింత స్వింగ్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ ఇద్దరూ శాండ్‌పేపర్‌ను వాడారని తేలింది. బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డారనే నేరంపై ఈ ఇద్దర్నీ క్రికెట్ ఆస్ట్రేలియా కొన్నాళ్ల పాటు సస్పెండ్ చేసింది. స్మిత్ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అతడ్ని ఫ్యాన్స్ తీవ్రంగా ట్రోల్ చేశారు. అయితే కోహ్లీ అతడికి మద్దుతగా నిలబడ్డాడు. కానీ ఇప్పుడు సిడ్నీ టెస్టులో పాత గాయాన్ని మళ్లీ రేపాడు. స్మిత్‌కు అప్పుడు సపోర్ట్‌గా ఉన్నోడు.. ఇప్పుడు తనను కంగారూ ఫ్యాన్స్ గెలకడంతో శాండ్‌పేపర్ ఉదంతాన్ని గుర్తుచేసి వాళ్లను ఏడిపించాడు. తన జేబులో శాండ్‌పేపర్ లేదని.. తాము మీలా కాదంటూ వాళ్లకు ఇచ్చిపడేశాడు.


ఇవీ చదవండి:

ఒక్కడికి వణికిన 15 మంది.. ఆసీస్‌కు నిద్రలేని రాత్రులు

ఆస్ట్రేలియాపై టీమిండియా ఓటమికి టాప్ 5 కారణాలు

బుమ్రాకు వెన్నునొప్పి

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 05 , 2025 | 04:21 PM