IPL 2025: వైజాగ్‌లో వాతావరణం ఎలా ఉంది.. మ్యాచ్‌కు వర్షం అడ్డుపడుతుందా
ABN , Publish Date - Mar 24 , 2025 | 06:21 PM
వైజాగ్‌లో ఐపీఎల్ మ్యాచ్‌కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. 1,700 మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాటు చేశారు. స్టేడియం సమీప ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. ఇప్పటికే అభిమానులు భారీ సంఖ్యలో స్టేడియంకు చేరుకున్నారు. అయితే వైజాగ్‌లో వాతావరణ పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది.

విశాఖపట్నం ఓ ఐపీఎల్ (IPL 2025) మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వబోతోంది. సోమవారం రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్ (DC), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. 1,700 మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాటు చేశారు. స్టేడియం సమీప ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. ఇప్పటికే అభిమానులు భారీ సంఖ్యలో స్టేడియంకు చేరుకున్నారు. అయితే వైజాగ్‌లో వాతావరణ పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది (DC vs LSG).
వైజాగ్ చుట్టు పక్కల ప్రాంతాలు, అనకాపల్లి జిల్లాలో మధ్యాహ్నం వర్షం కురిసింది. వైజాగ్‌లో మాత్రం వర్షం కురవకపోయినప్పటికీ ఆకాశం మేఘావృతమై ఉంది. వర్షం కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ కూడా వైజాగ్‌లో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అయితే సోమవారం సాయంత్రం వరకు వైజాగ్ నగరంలో వర్షం కురవలేదు. మ్యాచ్ జరిగే సమయంలో కూడా వర్షం కురవకపోతే క్రికెట్ అభిమానులకు పండగే.
ఇవి కూడా చదవండి..
MS Dhoni: ఐపీఎల్ బాగానే ఉంది.. మరింత మసాలా అవసరం లేదు: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై ధోనీ స్పందన
Harbhajan Singh: నల్ల ట్యాక్సీ అంటూ ఆర్చర్‌పై వివాదస్పద వ్యాఖ్యలు.. హర్భజన్‌పై తీవ్ర ఆగ్రహం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..