MS Dhoni: ధోని ఏ భాషకు ఎక్కువగా ఆకర్షితుడయ్యాడు..హిందీ, ఇంగ్లీష్, తమిళ్ మాత్రం కాదు..
ABN , Publish Date - Mar 24 , 2025 | 06:57 PM
స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని తనకు నచ్చిన కామెంట్రీ భాష గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ వాటిలో హిందీ, ఇంగ్లీష్, తమిళ్ మాత్రం లేకపోవడం విశేషం. అయితే ఏం చెప్పారనే విషయాలను ఇక్కడ చూద్దాం.

క్రికెట్ ప్రపంచంలో మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) గురించి తెలియని వారు దాదాపు ఉండరని చెప్పవచ్చు. ఎన్నో రికార్డులు నెలకొల్పిన ధోని, ఎప్పటికప్పుడు తన ఆట తీరుతో అభిమానులను ఆకర్షిస్తూనే ఉంటాడు. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. ఈ క్రమంలోనే తాజాగా ధోని ఓ మీడియాతో మాట్లాడిన క్రమంలో తనకు ఎంతో ఇష్టమైన కామెంట్రీ, ప్రాంతీయ భాష గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.
ఆసక్తికరంగా ఉంటుందని..
ఆ క్రమంలో మాట్లాడిన ధోని హిందీ, ఇంగ్లీష్, తమిళ భాషలపై ఆసక్తి చూపకుండా, విభిన్న ప్రాంతీయ భాష గురించి ప్రస్తావించడం విశేషం. ఆయన చెప్పినట్లు తనకు హర్యాన్వి భాషలో ఉన్న కామెంట్రీ అంటే ఇష్టమని ధోని తెలిపాడు. ఇది చాలా ఉత్సాహభరితంగా ఉంటుందని, చాలా ఆత్మీయంగా అనిపిస్తుందన్నారు. ఇది తన స్కూల్ సమయంలో రేడియో కామెంట్రీని గుర్తుకు తెస్తుందనీ ప్రస్తావించారు. ఆ పద్ధతి ఆసక్తికరంగా ఉంటుందని, ఆటను అనుభవించడానికి కొత్తగా అనిపిస్తుందన్నారు.
అనేక విషయాలను
ఈ క్రమంలో తాను ప్రాంతీయ భాషలలో ఉన్న కామెంట్రీని పెద్దగా వినలేదని, కానీ ముఖ్యంగా బిహారీ (భోజ్‌పురి) కామెంట్రీ ఉత్సాహంగా ఉంటుందని ధోని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఎక్కువగా ఇంగ్లీష్ లేదా హిందీ చూస్తున్నానని, కానీ వివిధ టోర్నమెంట్లలో ఉన్న అనుభవం ప్రతి ఒక్కరికి కొత్త అనుభూతులను ఇస్తుందన్నారు. ఆ క్రమంలో వారు మాకు అనేక విషయాలను పరిచయం చేస్తారని, అదే సమయంలో ఇతర విషయాలను కూడా పరిశీలిస్తామన్నారు.
ప్రాంతీయ భాషల్లో
ప్రత్యేకంగా జట్టు వ్యూహం, వాటి మెరుగుదల కోసం విభిన్న ప్రాంతీయ భాషల్లో కామెంట్రీ వినడం ఎంతగానో సహాయపడుతుందన్నారు. ఆ విధంగా, జట్టు విషయంలో మార్పు చేసే అవకాశాలు పెరుగుతాయన్నారు. దీనిని బట్టి చూస్తే ధోని స్థానిక సమాజం, వారి అభిరుచులకు కూడా గౌరవం ఇస్తుందన్నారు.
ఇవి కూడా చదవండి:
IPL 2025: CSKపై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు..వీడియో వైరల్
Recharge Offer: క్రేజీ ఆఫర్..రూ.5కే డేటాతోపాటు అన్ లిమిటెడ్ కాలింగ్..
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
Read More Business News and Latest Telugu News