Minister Satyakumar: అందుకే డీలిమిటేషన్‌ను తెరపైకి తెచ్చారు.. డీఎంకేపై మంత్రి సత్యకుమార్ యాదవ్ విసుర్లు
ABN , Publish Date - Mar 24 , 2025 | 08:22 PM
Minister Satyakumar: డీఎంకే పార్టీపై మంత్రి సత్యకుమార్ యాదవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తమిళనాడులో ఎన్నికలు ఉన్నందునే డీలిమిటేషన్‌ను డీఎంకే పార్టీ తెరమీదకు తెచ్చిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు.

అమరావతి: డీలిమిటేషన్‌పై మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా డీలిమిటేషన్ కమిటీ వేస్తారని.. ఆ కమిటీ చర్చించిన తర్వాతే పునర్విభజన జరుగుతుందని స్పష్టం చేశారు. కొన్ని రాజకీయ కారణాల వల్ల ఓ పార్టీ, ఓటమి అంచున ఉన్న మరో పార్టీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని మండిపడ్డారు. ఇవాళ(సోమవారం) మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్‌పై వాదన చేస్తున్న వారంతా కుటుంబం ప్రయోజనం కోసం ప్రయత్నించిన వారేనని చెప్పారు. డీఎంకే పార్టీ (ద్రవిడ మున్నేట్ర కజగం) కూడా హిందీని బూచిగా చూపి అధికారంలోకి వచ్చిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు.
ఇప్పుడు డీలిమిటేషన్‌ను ఎత్తుకున్నారని విమర్శించారు. రాష్ట్రాల మనోభావాలను కూడా తీసుకునే కోపరేటివ్ ఫెడరలిజంతో ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు. సడన్‌గా ఈ వాదనను తమిళనాడులో ఎన్నికలు ఉన్నందునే తెరమీదకు తెచ్చారని ఆరోపించారు. జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు అన్యాయం జరగదని తాను భావిస్తున్నామని చెప్పారు. డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్, టాక్స్‌లు రూ.26 నుంచి రూ. 34వేల కోట్లు గతంలో వస్తే గత ఏడాది రాష్ట్రానికి రూ.96వేల కోట్లు వచ్చాయని తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సీట్లు ఎక్కువ ఉన్న అభివృద్ధిలో ముందులేదని అన్నారు. కేరళలో 20 సీట్లు ఉన్న అభివృద్ధిలో వెనుక లేదని చెప్పారు. జనాభాను బట్టి రాష్ట్రాల అభివృద్ధి జరగదని.. అక్కడ పొలిటికల్ విల్ అభివృద్ధికి కారణమని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
TDP MP: విడదల రజినికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కౌంటర్
High Court Orders: బోరుగడ్డపై పోలీసుల పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు
Good News: ఏపీ ఉద్యోగులకు పండుగలాంటి వార్త
Read Latest AP News And Telugu News