Padma Awards: పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం.. స్పోర్ట్స్ కేటగిరీలో ఒక్కరికే
ABN , Publish Date - Jan 25 , 2025 | 08:18 PM
Padma Awards 2025: రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ నేపథ్యంలో ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. 30 మంది అవార్డులకు ఎంపికయ్యారు. అందులో స్పోర్ట్స్ కేటగిరీ నుంచి కేవలం ఒక్కరే ఉండటం గమనార్హం.

గణతంత్ర దినోత్సవ సంబురాల వేళ కేంద్ర సర్కారు పద్మ పురస్కారాలు ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు సెలెక్ట్ చేసింది ప్రభుత్వం. క్రీడా రంగం నుంచి కేవలం ఒకే వ్యక్తికి పురస్కారం దక్కింది. హరియాణాకు చెందిన పారాలింపియన్ గోల్డ్ మెడల్ విన్నర్ హర్వీందర్ సింగ్‌ను ఈ అవార్డు వరించింది. ఇది ఫస్ట్ లిస్టే కావడంతో మిగిలిన జాబితాల్లో మరింత మంది ఆటగాళ్లు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. పద్మశ్రీకి ఎంపికైన హర్వీందర్ మీద అన్ని వైపుల నుంచి ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. అతడ్ని ప్రముఖులతో పాటు అభిమానులు అభినందిస్తూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.
ఇవీ చదవండి:
రాత మార్చేందుకు పాత రూటులోకి.. కోహ్లీ ఊహించని ట్విస్ట్
క్రికెట్ చరిత్రలో సంచలనం.. 73 ఏళ్ల ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్
ఐసీసీ టీ20 టీమ్.. భారత్ నుంచి నలుగురు స్టార్లు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి