సింధుకు షాక్
ABN , Publish Date - Mar 20 , 2025 | 04:02 AM
స్టార్ షట్లర్, పీవీ సింధు ఫామ్‌లేమి కొనసాగుతోంది. తాజాగా స్విస్ ఓపెన్‌లోనూ నిరాశపరుస్తూ ఆరంభరౌండ్లోనే వెనుదిరిగింది. బుధవారం జరిగిన సింగిల్స్ పోరులో...

ఆరంభ రౌండ్లో పరాజయం
ప్రణయ్‌పై శ్రీకాంత్ గెలుపు
బాసెల్: స్టార్ షట్లర్, పీవీ సింధు ఫామ్‌లేమి కొనసాగుతోంది. తాజాగా స్విస్ ఓపెన్‌లోనూ నిరాశపరుస్తూ ఆరంభరౌండ్లోనే వెనుదిరిగింది. బుధవారం జరిగిన సింగిల్స్ పోరులో డెన్మార్క్‌కు చెందిన జూలీ దావల్ జాకబ్‌సెన్ 21-17, 21-19తో సింధుకు షాకిచ్చింది. ఇక, కిడాంబి శ్రీకాంత్ 23-21, 23-21తో భారత్‌కే చెందిన హెచ్‌ఎస్ ప్రణయ్‌ను ఓడించగా, శంకర్ ముత్తుస్వామి 21-5, 21-16తో మాగ్నస్‌పై నెగ్గి రెండోరౌండ్ చేరారు. డబుల్స్‌లో గాయత్రి/ట్రీసా జాలీ ద్వయం 21-16, 21-17తో ముల్లర్ (స్విట్జర్లాండ్)/కెల్లీ వాన్(నెదర్లాండ్స్) జంటపై గెలిచింది. మిగతా భారత షట్లర్లలో ఇషా రాణి, అనుపమ సింగిల్స్‌లో రెండోరౌండ్‌కు దూసుకెళ్లారు.