Apple iPhone: మార్కెట్లోకి కొత్త ఐఫోన్ మోడల్.. ఈనెల 28 నుంచి సేల్, 10 వేలు తగ్గింపు ఆఫర్
ABN , Publish Date - Feb 24 , 2025 | 04:25 PM
ఆపిల్ స్మార్ట్‌ఫోన్ ప్రియులకు శుభవార్త వచ్చేసింది. ఇప్పటికే భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ 16e సేల్ మరికొన్ని రోజుల్లో మొదలు కానుంది. ఈ సందర్భంగా ఈ మోడల్‌పై దాదాపు రూ. 10 వేల తగ్గింపు ఆఫర్ ప్రకటించారు.

ఆపిల్ ఐఫోన్ (Apple iPhone) ప్రియులకు గుడ్ న్యూస్. ఎందుకంటే ఈ సంస్థ నుంచి మరో కొత్త మోడల్ మార్కెట్లోకి వచ్చింది. అదే ఐఫోన్ 16e. ఇప్పటికే ఈ మోడల్ కోసం పోటీ మొదలైంది. ఈ క్రమంలో ప్రీ ఆర్డర్లు ఫిబ్రవరి 21 నుంచి మొదలు కాగా, సేల్ మాత్రం ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమవుతుంది. దీనిని ఇండియాలో రూ. 59,900 ధరకు సేల్ చేయనున్నారు. ఈ సేల్ నేపథ్యంలో ఐఫోన్ 16e మోడల్‌పై రూ. 10,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. ఐఫోన్ 16e స్మార్ట్‌ఫోన్‌పై క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కూడా అందిస్తామని ప్రకటించారు.
క్యాష్‌బ్యాక్ ఆఫర్..
ICICI బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, SBI క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులపై రూ. 4,000 క్యాష్‌బ్యాక్ అందించనున్నట్లు తెలిపారు. ఈ క్యాష్‌బ్యాక్ తర్వాత, ఫోన్ ధర రూ. 55,900కి చేరనుంది. దీంతో పాటు పాత ఫోన్‌ను మార్పిడి చేసుకుంటే రూ. 6000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఆ తర్వాత ధర రూ.49,900కి తగ్గుతుంది. ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ అనేది మీ పాత ఫోన్ పరిస్థితి, మోడల్ ఆధారంగా మారుతుంది.
ఆపిల్ ఇంటెలిజెన్స్..
ఇక ఈ ఐఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే 16e స్మార్ట్‌ఫోన్ 6.1 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. దీంతో పాటు ఆపిల్ దీనిలో ఫేస్ ఐడీ వ్యవస్థను అమర్చింది. దీంతో పాటు కంపెనీ మ్యూట్ బటన్‌ను యాక్షన్ బటన్‌తో రీ ప్లేస్ చేసింది. USB సీ పోర్టును కూడా అందించింది. ఈ మోడల్ A18 చిప్‌ను కలిగి ఉంది. ఇది జెన్మోజీ, రైటింగ్ టూల్స్, చాట్ జీపీటీ ఇంటిగ్రేషన్ వంటి ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది. ఆపిల్ విజువల్ ఇంటెలిజెన్స్‌కు కూడా సపోర్ట్ చేస్తుందని సంస్థ తెలిపింది.
రికార్డింగ్ కూడా..
ఇక కెమెరా గురించి మాట్లాడుకుంటే iPhone 16eలో 48MP ఫ్యూజన్ బ్యాక్ కెమెరా ఉంది. ఇది 2x డిజిటల్ జూమ్, పోర్ట్రెయిట్ మోడ్, నైట్ మోడ్, HDRలకు మద్దతు ఇస్తుంది. దీంతో పాటు ముందు భాగంలో 12MP ట్రూడెప్త్ కెమెరాను అందిస్తున్నారు. ఇది ఆటో ఫోకస్‌తోపాటు 4K వీడియోను రికార్డింగ్ చేసుకునే అవకాశం ఉంది. కానీ ఆపిల్ దీని ర్యామ్ వివరాలు ప్రకటించలేదు. కానీ దీనిలో 8GB RAM ఉండవచ్చని తెలుస్తోంది. ఈ మోడల్ మూడు వేరియంట్లలో అమ్మకానికి అందుబాటులో ఉంది. వాటిలో 128GB స్టోరేజ్ ధర రూ. 59,900 ఉండగా, 256GB స్టోరేజ్ రేటు రూ. 69,900, 512GB స్టోరేజ్ ధర రూ. 89,900గా ఉంది.
ఇవి కూడా చదవండి:
OpenAI: ఓపెన్ ఏఐ నుంచి కొత్తగా ఏఐ ఏజెంట్.. దీని స్పెషల్ ఏంటంటే..
Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..
Aadhaar Update: అలర్ట్.. ఆధార్‌లో మీ నంబర్, పేరు, అడ్రస్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చో తెలుసా..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News