Sunita williams: సునీత విలియమ్స్ కోసం ప్రార్థనలు చేద్దాం: సామాజిక వేత్త నిజాముద్దీన్
ABN , Publish Date - Mar 17 , 2025 | 09:34 PM
భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్, నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ క్షేమంగా భూమిపై చేరుకోవాలని, అందరూ భగవంతుణ్ని ప్రార్థించాలని హైదరాబాద్‌కు చెందిన సామాజికవేత్త నిజాముద్దీన్ కోరారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్, నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ క్షేమంగా భూమిపై చేరుకోవాలని, అందరూ భగవంతుణ్ని ప్రార్థించాలని హైదరాబాద్‌కు చెందిన సామాజికవేత్త నిజాముద్దీన్ కోరారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సునీత విలియమ్స్ మరో రెండు రోజుల్లో భూమిపై చేరుకోనున్నట్లు నాసా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిజాముద్దీన్ ఆమె కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
సునీత విలియమ్స్ మరో రెండ్రోజుల్లో భూమి పైకి చేరుకోవడం ఆనందించదగ్గ విషయం అని నిజాముద్దీన్ అన్నారు. ఆమె క్షేమంగా భూమిపై తిరిగి రావాలని గత ఐదు నెలలుగా ప్రత్యేక వీడియోలను రూపొందించి సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నట్లు నిజాముద్దీన్ తెలిపారు. ఆమె కోసం సర్వమత ప్రార్థనలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఖగోళంలో చిక్కుకుపోయినా అధైర్య పడకుండా ఉండడం ఎంతోమందిని ఆకర్షించిందని ఆయన అన్నారు. రంజాన్ మాసం కావడంతో ఈ నెలరోజులూ ముస్లిం సోదరులతో ప్రత్యేక ప్రార్థనలను కూడా నిర్వహిస్తున్నట్లు నిజాముద్దీన్ తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తలు కోసం క్లిక్ చేయండి..