Share News

Adilabad: కాలం మార్చిన రంగులు

ABN , Publish Date - Mar 12 , 2025 | 04:52 AM

వర్షాకాలంలో పచ్చదనంతో కనులవిందు చేసిన ఆ చెట్లు నేడు తలవాల్చాయి. వాన నీటిని ముద్దాడి మట్టి సువాసన వెదజల్లిన అదే భూమి నేడు వేసవిలో దాహార్తితో చిట్లిపోయింది.

Adilabad: కాలం మార్చిన రంగులు

వర్షాకాలంలో పచ్చదనంతో కనులవిందు చేసిన ఆ చెట్లు నేడు తలవాల్చాయి. వాన నీటిని ముద్దాడి మట్టి సువాసన వెదజల్లిన అదే భూమి నేడు వేసవిలో దాహార్తితో చిట్లిపోయింది. నిర్మల్‌ - ఆదిలాబాద్‌ జిల్లాల సరిహద్దులోని సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో తీసిన ఈ చిత్రాలు చూస్తుంటే.. ఏదీ శాశ్వతం కాదు.. కాలంతోపాటు అన్నీ మారతాయి.. అనే మాటలకు నిదర్శనంగా ఉన్నాయి కదా....!! వాన చినుకు తాకగానే ఆ ప్రాంతం నేలకు పచ్చని చీర కట్టినట్టు ఆహ్లాదపరిచే మునుపటి అందాన్ని సొంతం చేసుకోవడం ఖాయం.. అలాగే, ప్రస్తుతం కష్టకాలంలో ఉన్నవారు కాస్త ఓపికగా ఉంటే తిరిగి సుఖసంతోషాలు పొందడం కూడా అంతే ఖాయం. ఇదే ప్రకృతి నుంచి మనిషి నేర్చుకోవాల్సినపాఠం.

-ఆంధ్రజ్యోతి, ఆదిలాబాద్‌ స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌

Updated Date - Mar 12 , 2025 | 04:52 AM