Share News

రాజ్‌తరుణ్‌-లావణ్య కేసులో... నార్సింగ్‌ డీఐ శ్రీనివాస్‌‌‌పై బదిలీ వేటు

ABN , Publish Date - Feb 12 , 2025 | 04:26 AM

రాజ్‌తరుణ్‌-లావణ్య కేసులో నార్సింగ్‌ పోలీస్‌ స్టేషన్‌లో డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీనివా్‌సపై బదిలీ వేటు పడింది. ఆయనపై పలు ఆరోపణలు రావడంతో ఐజీ కార్యాలయానికి అటాచ్‌ చేశారు.

రాజ్‌తరుణ్‌-లావణ్య కేసులో... నార్సింగ్‌ డీఐ శ్రీనివాస్‌‌‌పై బదిలీ వేటు

  • నేను చాలా గలీజ్‌... ఓ పోలీసు అధికారితో లావణ్య మాటలు వైరల్‌

  • సంచలనం రేపుతున్న ఆడియో క్లిప్‌

నార్సింగ్‌/హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): రాజ్‌తరుణ్‌-లావణ్య కేసులో నార్సింగ్‌ పోలీస్‌ స్టేషన్‌లో డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీనివా్‌సపై బదిలీ వేటు పడింది. ఆయనపై పలు ఆరోపణలు రావడంతో ఐజీ కార్యాలయానికి అటాచ్‌ చేశారు. కేసు విచారణ సమయంలో లావణ్య ఇంటికి వెళ్లిన శ్రీనివాస్‌.. ఆమెతో కుమ్మక్కై కేసును తప్పుదోవ పట్టించినట్లు ప్రాథమిక సమాచారం అందడంతో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతర్గత విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఉన్నతాధికారులు ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఈ కేసులో మస్తాన్‌ సాయి అరెస్టు తర్వాత ఆడియో టేపుల లీకులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒక్కో ఆడియో టేపులో ఒక్కో విషయం ఉండడంతో సోషల్‌ మీడియాలో సంచలనంగా మారుతోంది. తాజాగా డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ బదిలీ కావడం వీటి ప్రభావమేనని వినిపిస్తోంది. మస్తాన్‌ సాయి నుంచి స్వాధీనం చేసుకున్న హర్డ్‌డి్‌స్కలో నగ్న వీడియోలు, ఫొటోలతో పాటు ఆడియో క్లిప్‌లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.


ఓ పోలీసు అధికారితో లావణ్యదిగా చెబుతున్న సంభాషణ ఆడియో క్లిప్‌ ఇప్పుడు వైరల్‌ అయింది. అందులో ‘రావటం లేదని చెప్పాలా నీకు? వస్తా అంటే ఏమైతది..ఇప్పుడు నీకు? వస్తా అంటే ఏం చేస్తరు? అవన్నీ మీకు ఎందుకు..? నాకు కావాలి!’ అని ఆమె అంటే ‘రావద్దు అర్థం చేసుకోండి’ అని ఆ పోలీస్‌ అధికారి బదులిచ్చాడు. దానికి ఆమె స్పందిస్తూ ‘అర్థం చేసుకోను... గలీజ్‌... నేను చాలా గలీజ్‌... నేను ఇప్పుడే వస్తా... మీరు డ్యూటీలో ఉన్నారు. పనిలో ఉండి కలవలేక అవ్వలేదు అంటే పర్వాలేదు.. నో ప్రాబ్లమ్‌! సరే... అప్పుడు దూరం నుంచి మిమ్మల్ని చూసి వెళ్లిపోతాను. నీ బతుకు నువ్వు చూసుకో... నీది నువ్వు చూసుకో... సంబంధం లేనట్టుగా ఉండు. జస్ట్‌ సరదాగా ఇన్ఫర్మేషన్‌ ఇచ్చేయండ’ని అడిగింది. దానికి ఆ పోలీసు అధికారి.. ‘నీ గురించి ఇస్తాను.. ఇన్ఫర్మేషన్‌ ఇస్తాను... ఎక్స్‌క్లూజివ్‌ ఇస్తాను’ అని బదులిచ్చాడు. దానికి ఆమె ‘ఎలాగైతే కాప్స్‌తో ఉన్నానో.. మీతో అలాగే ఉంటాను. మనసులోనే ఉంచుకుంటాన’ని తెలిపింది.

Updated Date - Feb 12 , 2025 | 04:26 AM