Share News

MLA: రెచ్చగొట్టే మాటలు నమ్మవద్దు..

ABN , Publish Date - Jan 18 , 2025 | 10:38 AM

విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌కు అనుగుణంగా రోడ్ల విస్తరణ జరుగుతోందని అందులో భాగంగానే కంటోన్మెంట్‌ ప్రాంతంలో ప్రజల ట్రాఫిక్‌ కష్టాలు తీర్చడానికి ప్రభుత్వం ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం చేపట్టిందని కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే శ్రీగణేష్‌ అన్నారు.

MLA: రెచ్చగొట్టే మాటలు నమ్మవద్దు..

సికింద్రాబాద్: విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌(Hyderabad) నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌కు అనుగుణంగా రోడ్ల విస్తరణ జరుగుతోందని అందులో భాగంగానే కంటోన్మెంట్‌ ప్రాంతంలో ప్రజల ట్రాఫిక్‌ కష్టాలు తీర్చడానికి ప్రభుత్వం ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం చేపట్టిందని కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే శ్రీగణేష్‌(Cantonment MLA Sri Ganesh) అన్నారు. కంటోన్మెంట్‌ నియోజకవర్గంలో నిర్మించనున్న ఎలివేటెడ్‌ కారిడార్‌లో భాగంగా భూముల సేకరణకు సంబంధించి స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఆధ్వర్యంలో చిన్నతోకట్ట కమ్యూనిటీహాలులో స్థానికులతో శుక్రవారం ఏర్పాటుచేసిన గ్రామ సభలో ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: సినిమాలో వేషం ఇప్పిస్తానని లైంగిక దాడి


ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. భూములు కోల్పోతున్న బాధితులతో ఆయ న మాట్లాడారు. చట్టప్రకారమే అందరికీ నష్టపరిహారం అందజేస్తామని అన్నారు. సంతృప్తికర స్థాయిలో నష్టపరిహారం ఇప్పించే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. భూసేకరణలో ఎక్కడైనా ఆలయాల భూమి సేకరించాల్సి వస్తే అక్కడ కూడా భక్తులు, ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


ఎమ్మెల్యేను కలిసిన పోచంపల్లి శ్రీనివాస్‌

హైదరాబాద్: ప్రతి నియోజక వర్గంలో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే శ్రీగణేష్‌(MLA Sri Ganesh) సూచించారు. గ్రేటర్‌ గ్రంథాలయ శాఖ డైరెక్టర్‌ పోచంపల్లి శ్రీనివాస్‌ శుక్రవారం ఎమ్మెల్యే శ్రీగణేష్‌ ఆయన నివాసంలో చైర్మన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు.


సీఎం రిలీఫ్‌ ఫండ్‌ అందజేత

సికింద్రాబాద్‌: కంటోన్మెంట్‌ నియోజకవర్గం అన్నానగర్‌కు చెందిన శ్రీమతి వర్ధోలు కాలమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఎమ్మెల్యేను సంప్రదించగా ముఖ్యమంత్రి సహాయనిధి నుండి రూ.5లక్షల (ఎల్‌ఓసీ) పత్రాలను వారి కుటుంబసభ్యులకు అందించారు.


ఈవార్తను కూడా చదవండి: Hyderabad: ఆ దొంగలు ఎక్కడ?

ఈవార్తను కూడా చదవండి: 6 హామీల్లో అర గ్యారెంటీనే అమలు

ఈవార్తను కూడా చదవండి: ఆయిల్ పామ్ హబ్‌గా తెలంగాణ

ఈవార్తను కూడా చదవండి: హై అలర్ట్‌గా తెలంగాణ- ఛత్తీస్‌గడ్ సరిహద్దు..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 18 , 2025 | 10:38 AM