Share News

Taskforce Dcp: డ్రగ్స్ పెడ్లర్లు అరెస్ట్.. షూటర్ల కోసం గాలింపు

ABN , Publish Date - Feb 05 , 2025 | 04:51 PM

Taskforce Dcp: అఫ్జల్ గంజ్‌లో కాల్పులకు తెగబడిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని టాస్క్ ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. అలాగే డ్రగ్స్ విక్రయిస్తున్న వారిని సైతం అరెస్ట్ చేశామని చెప్పారు.

Taskforce Dcp: డ్రగ్స్ పెడ్లర్లు అరెస్ట్.. షూటర్ల కోసం గాలింపు

హైదరాబాద్, ఫిబ్రవరి 05: డ్రగ్ పెడ్లింగ్ చేస్తున్న ఒలివర్ అలియాస్ జాన్సన్‌ను అరెస్ట్ చేశామని టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర బుధవారం హైదరాబాద్‌లో వెల్లడించారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫరా చేయడానికి డ్రగ్ పెడర్లు వచ్చినట్లు తమకు సమాచారం అందిందని..ఈ నేపథ్యంలో లంగర్ హౌస్ పోలీసులతో కలిసి నార్కోటిక్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారన్నారు. దీంతో డ్రగ్స్ కేసులో ఆఫ్రికాకి చెందిన ముగ్గురు డ్రగ్స్ నిందితులను అరెస్ట్ చేశామని వివరించారు. 2009లో జాన్సన్ అలియాస్ జాన్.. బిజినెస్ వీసాపై ఇండియాకు వచ్చాడని చెప్పారు.

2013లో అతడి వీసా గడువు ముగిసిందని తెలిపారు. ఇండియా వచ్చిన అనంతరం అతడు డ్రగ్స్ సరఫరా చేస్తూ వస్తున్నాడని పేర్కొన్నారు. ఢిల్లీ నుండి బెంగళూరుకు బల్క్‌లో డ్రగ్స్‌ సప్లై చేస్తున్నాడన్నారు. నైజేరియన్స్‌తో పరిచయం చేసుకొని హైదరాబాద్, బెంగళూరుకు డ్రగ్స్ సప్లై చేస్తూ వస్తున్నాడని వివరించారు. వారి వద్ద నుంచి 1300 గ్రాముల ఎండీఎంఏ, రూ. 1.60 కోట్లు డ్రగ్స్‌ సీజ్ చేసినట్లు తెలిపారు. అలాగే నిందితుడు ఒలివర్ అలియాస్ జాన్సన్‌ను కస్టడీలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక రోమియో అనే పాత నేరస్తుడిని సైతం అరెస్ట్ చేశామన్నారు. వీసా గడువు ముగిసిన సెల్ వేస్టార్.. హైదరాబాద్‌లోనే ఉంటున్నారని డీసీపీ సుధీంద్ర తెలిపారు.


ఇక అఫ్జల్ గంజ్‌ కాల్పుల కేసులో నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు చెప్పారు. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారని వివరించారు. బీదర్, అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసులో నిందితులు.. బీహార్ వాసులుగా గుర్తించామన్నారు. ఇతర రాష్ట్రాల్లో సైతం వీరు.. ఈ తరహా నేరాలు చేసినట్లు గుర్తించామని డీసీపీ సుధీంద్ర చెప్పారు.

Also Read: మిర్చి బోర్డు ఏర్పాటు చేయండి: ప్రత్తిపాటి డిమాండ్


మరోవైపు నగరంలో డ్రగ్స్‌ విక్రయాలపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపింది. అలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమిస్తోందవి. అందులోభాగంగా డ్రగ్స్ విక్రయిస్తూ దొరికిన వారిని అరెస్ట్ చేసి.. వారికి కఠినంగా శిక్షించేందుకు ప్రణాళికలు రూపొందించి.. వాటిని పక్కాగా అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అయినా.. హైదరాబాద్‌లో ఎక్కడో అక్కడ డ్రగ్స్ దొరుకుతూనే ఉంది.

Also Read : కడప జిల్లాలో క్లబ్ మూసివేసిన పోలీసులు


ఇక అఫ్జల్ గంజ్ కాల్పుల ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఇది బిహార్ ముఠా పనేనని పోలీసులు సైతం విశ్వసిస్తున్నారు. అందుకోసం ఈ కాల్పులు జరిపిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. గతేడాది డిసెంబర్‌లోని హాజీపూర్ ప్రాంతం నుంచి ఇద్దరు వ్యక్తులు బైక్‌పై కర్ణాటకలోని బీదర్‌కు చేరుకున్నారు. స్థానిక ఏటీఎమ్‌ను పగలు కొట్టి.. భారీగా నగదు దోచుకున్నారు.


ఆ క్రమంలో కాల్పులు జరపగా.. ఇద్దరు వ్యక్తులు మరణించారు. అనంతరం బైక్‌పై వారు.. హైదరాబాద్‌లోని అఫ్జజ్‌గంజ్ చేరుకొని.. స్థానికులపై కాల్పులు జరిపారు. అనంతరం వారు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా సీసీ పుటేజ్‌లను వారు పరిశీలించారు. దీంతో బీదర్‌లోని ఏటీఎమ్‌లో నగదు దొంగించింది.. అఫ్జల్‌గంజ్‌లో కాల్పులు జరిపిందిన ఒకటేనని పోలీసులు తేల్చారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

For Telangana News And Telugu News

Updated Date - Feb 05 , 2025 | 04:51 PM