Share News

Ponguleti Srinivasa Reddy: కేటీఆర్‌పై వ్యంగ్య బాణాలు సంధించిన పొంగులేటి

ABN , Publish Date - Jan 07 , 2025 | 07:10 PM

Ponguleti Srinivasa Reddy: ఫార్ములా రేసుల కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తున్న తీరుపై తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యంగ్య బాణాలు సంధించారు.

Ponguleti Srinivasa Reddy: కేటీఆర్‌పై వ్యంగ్య బాణాలు సంధించిన పొంగులేటి
TG Minister Pongulati Srinivas Reddy

హైదరాబాద్, జనవరి 07: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మారలేదని.. కానీ ఆయన రైటర్ మారినట్లుగా ఉందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యంగ్యంగా అన్నారు. కారు రేసు కేసులో హైకోర్టు తీర్పు అనంతరం కేటీఆర్ ట్వీట్ చేసిన నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. ఆ క్రమంలో కేటీఆర్‌పై ఆయన వ్యంగ్య బాణాలు సంధించారు.

మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. సియోల్ బాంబులు పేలడం మొదలవుతున్నాయన్నారు. చేసిన తప్పు ఎప్పటికైనా బయటపడుతుందని ఆయన పేర్కొన్నారు. తప్పు చేసిన వారు.. ఎప్పటికీ తప్పించుకో లేరని స్పష్టం చేశారు. అయితే న్యాయస్థానాలు, వ్యవస్థల ముందు బల ప్రదర్శన చేయడం కరెక్ట్ కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

తప్పులు.. ఒప్పులు తేల్చేది కోర్టులని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తమకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు టార్గెట్ కాదని స్పష్టం చేశారు. తాము ఎవరినీ టార్గెట్ చేయలేదన్నారు. కేటీఆర్ తప్పు చేయక పోతే కోర్టుకు ఎందుకు వెళ్లారు? అని ఆయన ప్రశ్నించారు. కొత్త సంవత్సరంలో కేటీఆర్‌లో స్పిరిట్ పెరిగిందని చమత్కరించారు.


కాంగ్రెస్ పార్టీకి బాండ్స్ ఎందుకు ఇచ్చారో.. అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చెప్పాలని డిమాండ్ చేశారు. బాండ్స్ మాత్రమే కాదు ఇంకా బయటకు రావాల్సినవి చాలా ఉన్నాయన్నారు. ఇక విదేశీ కంపెనీకి వెళ్లిన నగదు ఎవరి ఖాతాలోకి వెళ్ళాయో తేలాల్సి ఉందన్నారు. దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో అత్యంత రిచేస్ట్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుర్తు చేశారు. ఆ పార్టీకి అంత నగదు ఎలా వచ్చిందంటూ ఈ సందర్భంగా ఆయన సందేహం వ్యక్తం చేశారు.

Also Read: మోదీ పర్యటన.. ఎంపీ పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు


కేసీఆర్ ఏ కేసులో ఉన్నా.. మాజీ మంత్రి హరీష్ రావు అక్కడ ఉంటారంటూ వ్యంగ్యంగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్‌ కుటుంబాన్ని కావాలని టార్గెట్ చేసే ఆలోచన లేదన్నారు. అయితే ఏది బయట పడినా.. అందులో ఆ కుటుంబం పాత్ర మాత్రం ఉంటుందన్నారు. ఇక ఇప్పటి వరకు వేసిన కేసులు, విచారణ కమిషన్లు అన్ని బిఆర్ఎస్ పార్టీ వాళ్లు అడిగితేనే వేశామని ఆయన గుర్తు చేశారు. కాళేశ్వరం, విద్యుత్, ఈ ఫార్ములా అంశాలపై సైతం విచారణ జరపాలని వారు కోరారని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. కక్షపూరితంగా, ఉద్దేశపూర్వకంగా చేసిందేమీ లేదన్నారు.

Also Read: కేటీఆర్ కేసులో హైకోర్టు ఆర్డర్ కాపీలో కీలక అంశాలు


వ్యవస్థలో వాళ్లు తప్పులు చేశారని.. కాబట్టే అన్ని బయటపడుతోన్నాయని చెప్పారు. జైలుకు వెళ్తేనే సీఎం అవుతానని కేటీఆర్ అనుకుంటే.. కల్వకుంట్ల కవిత ముందు ఉన్నారని గుర్తు చేశారు. ఇవేది లాభ నష్టాల కోసం జరుగుతున్నవి కావన్నారు. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ నిజాలు చేప్తే.. అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. జాతీయ పార్టీలకు లేని నిధులు ప్రాంతీయ పార్టీలకు ఎలా వచ్చాయంటూ ఆయన ఆనుమానం వ్యక్తం చేశారు.

Also Read: మరికొద్ది రోజుల్లో బడ్జెట్ .. ఎలా ఉండబోతోంది?


బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా.. దేశం గురించి తప్ప తెలంగాణ గురించి మాట్లాడలేదన్నారు. సంక్రాంతి పండుగ అనంతరం రికార్డులను ఫోరెన్సిక్ ఆడిట్ కోసం ప్రైవేట్ సంస్థలకు ఇవ్వబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. భూదాన్, దేవాదాయ, అసైన్డ్ భూముల్లో జరిగిన కుంభకోణాలన్నీ ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా బహిర్గమవుతాయని పేర్కొన్నారు.

Also Read: భూకంపం: 95 మంది మృతి


సిరిసిల్లలో 2 వేల ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందని తెలిపారు. రంగారెడ్డి, మెదక్, మేడ్చల్ జిల్లాల్లో జరిగిన భూ బాగోతం ఫోరెన్సిక్ ఆడిట్ తర్వాత వెలుగులోకి వస్తుందన్నారు. ఇక భుబారతి బిల్లు గవర్నర్ వద్ద ఉందని వివరించారు. గవర్నర్ నుంచి అనుమతి రాగానే గెజిట్ విడుదల అవుతుందని తెలిపారు. అయితే రూల్స్ ప్రేమ్ చేయడానికి రెండు నెలల సమయం పడుతుందన్నారు. విద్యుత్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది.. ప్రభుత్వం లీగల్ ఒపినియన్ తీసుకుంటున్నదన్నారు.


అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ బహిరంగ విచారణ సైతం కొనసాగుతోందన్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకా అవ్వ లేదని స్పష్టం చేశారు. ఈ కేసు ఇంకా కొనసాగుతుందన్నారు. తాను మంత్రి అయిన తర్వాత.. మా జిల్లా మాజీ మంత్రి తాను ఎదురు పడలేదన్నారు. అసలు ఉన్నాడా? లేడా అన్నట్లుగా ఉందన్నారు. ఫార్ములా కార్ల రేసు వ్యవహరంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు.. ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. తనకు గడువు ఇవ్వాలని ఈడీని ఆయన కోరారు. దీంతో జనవరి 16వ తేదీన హాజరుకావాలని కేటీఆర్‌ను ఆదేశించారు.


మరోవైపు తన క్వాష్ పిటిషన్‌ను మంగళవారం తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఈ సమయంలో ఆర్డర్ కాపీలో జడ్జి జస్టిస్ లక్ష్మణ్ సైతం కీలక వ్యాఖలు చేశారు. ఈ పరిణామంపై కేటీఆర్.. తన ఎక్స్ ఖాతా వేదికగా కాస్తా ఘాటుగా స్పందించారు. దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైవిధంగా స్పందించారు. మరోవైపు తన క్వాష్ పిటిషన్ తెలంగాణ హైకోర్టు కొట్టి వేయండంతో.. సుప్రీంకోర్టును కేటీఆర్ ఆశ్రయించారు. ఈ కేసు బుధవారం లేకుంటే గురువారం కోర్టు పరిశీలించే అవకాశముందని సమాచారం.

For Telangana News And Telugu News

Updated Date - Jan 07 , 2025 | 07:10 PM