Share News

వాస్తవాలకు చిరునామా ఆంధ్రజ్యోతి

ABN , Publish Date - Mar 25 , 2025 | 12:54 AM

‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక వాస్తవాలను నిక్కచ్చిగా చెప్పి పాఠకులను ఆకట్టుకుంటోందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ప్రపుల్‌ దేశాయ్‌ అన్నారు.

వాస్తవాలకు  చిరునామా ఆంధ్రజ్యోతి

ఫ 22 ఏళ్లుగా బహుమతులు ఇవ్వడం

అభినందనీయం

ఫ ‘ఆంధ్రజ్యోతి’ లక్కీ డ్రా కార్యక్రమంలో

అదనపు కలెక్టర్‌ ప్రపుల్‌ దేశాయ్‌

కరీంనగర్‌ టౌన్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక వాస్తవాలను నిక్కచ్చిగా చెప్పి పాఠకులను ఆకట్టుకుంటోందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ప్రపుల్‌ దేశాయ్‌ అన్నారు. సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ కరీంనగర్‌ యూనిట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్‌, బైక్‌ రేస్‌ డ్రా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠకుల నుంచి వచ్చిన కూపన్లలో నుంచి ప్రథ మ, ద్వితీయ, తృతీయ బహుమతి విజేతలను ఎంపిక చేశారు. అనంతరం విజేతలతో ఫోన్‌లో మాట్లాడి శుభాకాం క్షలు తెలిపారు. ప్రథమ బహుమతి బైక్‌ను ఎన్టీపీసీ రామ గుండంకు చెందిన శ్వేత శ్రీహర్ష గెలుచుకున్నారు. ద్వితీయ బహుమతి రిఫ్రిజిరేటర్‌ను గోదావరిఖనికి చెందిన గొడుగు శివకృష్ణ, తృతీయ బహుమతి ఎల్‌ఈడీ టీవీని కరీంనగర్‌ కశ్మీరుగడ్డకు చెందిన అన్జర్‌ హుస్సేన్‌ గెలుచుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ ప్రపుల్‌దేశాయ్‌ మాట్లాడుతూ 22 సంవత్స రాలుగా ప్రతి సంవత్సరం ఆంధ్రజ్యోతి పాఠకుల కోసం లక్కీ డ్రా నిర్వహించి ప్రథమ, ద్వితీయ, తృత్రీయ బహుమ తులతోపాటు వంద మందికి కన్సోలేషన్‌ బహుమ తులను అందించడం అభినందనీయమన్నారు. బహుమ తులు అందు కున్న ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలతో ఫోన్‌లో మాట్లాడగా వారు సంతోషం వ్యక్తం చేశారని తెలి పారు. డ్రాకు 20 వేలకు పైగా కూపన్లు వచ్చా యంటే పాఠకుల్లో ‘ఆంధ్రజ్యోతి’కి ఉన్న ఆదరణ తెలుస్తోం దని అన్నారు. కార్యక్రమంలో బ్రాంచి మేనేజర్‌ కళ్లెపు సంపత్‌ రెడ్డి, బ్యూరో ఇన్‌చార్జి నగునూరి శేఖర్‌, ఎడిషన్‌ ఇన్‌చార్జి జయంత్‌రావు, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ (అడ్వర్టయిజ్‌ మెంట్‌) దండ జనార్దన్‌రెడి,్డ ఏబీఎన్‌ స్టాఫ్‌ రిపోర్టర్‌ సంద వేని శ్రీనివాస్‌, డిప్యూటీ సర్క్యు లేషన్‌ మేనేజర్‌ పాపారావు, సిబ్బంది బొంగోని శ్రీనివాస్‌, జె రాజేందర్‌, శ్రావణ్‌ కుమార్‌, గజవాడ ఆంజనేయులు, అయిలేని సురేందర్‌రెడ్డి, బిట్ల లక్ష్మణ్‌, ఎండీ షుకూర్‌, దాడి సంపత్‌కుమార్‌ పాల్గొన్నారు.

ఆనందంగా ఉంది...

శ్వేతశ్రీహర్ష,

ప్రథమ బహుమతి విజేత, ఎన్టీపీసీ

నేను ఐదు సంవత్సరాలుగా ఆంధ్రజ్యోతి చందాదారుగా ఉన్నాను. క్రమం తప్పకుండా ఆంధ్రజ్యోతిని చదువుతాము. డ్రాలో నాకు ప్రథమ బహుమతి రావడం ఆనందంగా ఉంది. పాఠకులకు బహుమతులిచ్చి ప్రోత్సహిస్తున్న ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి కృతజ్ఞతలు.

క్రమం తప్పకుండా ఆంధ్రజ్యోతి చదువుతా..

- గొడుగు శివకృష్ణ, ద్వితీయ బహుమతి విజేత, గోదావరిఖని

ఆంధ్రజ్యోతి కార్‌, బైక్‌ రేసులో రెండో బహుమతి రావడం ఆనందంగా ఉంది. నేను ‘ఆంధ్రజ్యోతి’ని క్రమం తప్పకుండా చదువుతాను.

ఆంధ్రజ్యోతిలో వార్తలు బాగుంటాయి

- అన్జర్‌హుస్సేన్‌, కరీంనగర్‌, తృతీయబహుమతి విజేత

ఆంధ్రజ్యోతి దినపత్రిక యాజమాన్యం పాఠకుల కోసం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న లక్కీ డిప్‌ కార్యక్రమంలో ఈసారి నాకు థర్డ్‌ ప్రైజ్‌ ఎల్‌ఈడి టీవీ రావడం సంతోషంగా ఉంది. నగరంలోని మంచిర్యాల చౌరస్తాలో పాన్‌షాప్‌ నిర్వహిస్తూ ఉంటాను... ఆంధ్రజ్యోతిలో వార్తలు చాలా బాగుంటాయి... డ్రాలో బహుమతి గెలుచుకోవడంతో మరింత అభిమానం పెరిగింది.

Updated Date - Mar 25 , 2025 | 12:54 AM