ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయండి
ABN , Publish Date - Mar 25 , 2025 | 12:34 AM
తాను ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు దరఖాస్తు చేసుకున్నా పేరు రాలేదని, తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని రామగుండంలోని విద్యుత్‌నగర్‌కు చెందిన రుక్సానా అదనపు కలెక్టర్‌ను కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు తమ సమ స్యలను పరిష్కరించాలని దరఖాస్తులు అందజేశారు.

పెద్దపల్లి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): తాను ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు దరఖాస్తు చేసుకున్నా పేరు రాలేదని, తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని రామగుండంలోని విద్యుత్‌నగర్‌కు చెందిన రుక్సానా అదనపు కలెక్టర్‌ను కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు తమ సమ స్యలను పరిష్కరించాలని దరఖాస్తులు అందజేశారు. ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన ఎం గట్టయ్య సర్వే నెంబర్ 53/2లో 8 గుంటలు, సర్వే నెంబర్ 58సిలో 34 గుంటలు, సర్వే నెంబర్ 58సి/2లో 6.5 గుంటల భూమి తన తండ్రి నుంచి వారసత్వంగా సంక్రమించిం దని, ఈ భూమికి తన పేరు మీద పట్టా చేయించి పాస్ పుస్తకం ఇప్పించాలని కోరారు. మంథని మండలం లక్కారం గ్రామానికి చెందిన పి విజయలక్ష్మి, సీహెచ్ నాగమణి శుక్రవారంపేట గ్రామ శివారులో ఎకరం భూమి ఉందని, ఆ భూమి జాతీయ రహదారి కింద పోతుం దని, తమకు పరిహారం రెండవ కిస్తీ రాలేదని, పరిహారం ఇప్పించాలని కోరారు. గోదావరిఖని ప్రాంతానికి చెందిన శేషగిరిరావు తనకు రేషన్ కార్డు కింద ఆరు కిలోల బియ్యం వస్తున్నాయని, తనకు అంత్యోదయ కార్డుగా మార్చాలని కోరారు. ఇంకా పలువురు వివిధ సమస్యలపై దరఖాస్తు చేసుకోగా, సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారు లను అదనపు కలెక్టర్ డి వేణు ఆదేశించారు.