Share News

క్షయ వ్యాధికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

ABN , Publish Date - Mar 25 , 2025 | 12:36 AM

క్షయ వ్యాధికి గురి కాకుండా జగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో అన్నా ప్రసన్న కుమారి సూచించారు. క్షయ వ్యాది నివారణ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా ప్రధాన ఆసుపత్రి నుంచి అమర్‌ చంద్‌ కల్యాణమండపం వరకు ర్యాలీ నిర్వహించారు.

క్షయ వ్యాధికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

పెద్దపల్లిటౌన్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) క్షయ వ్యాధికి గురి కాకుండా జగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో అన్నా ప్రసన్న కుమారి సూచించారు. క్షయ వ్యాది నివారణ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా ప్రధాన ఆసుపత్రి నుంచి అమర్‌ చంద్‌ కల్యాణమండపం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమర్‌ చంద్‌ కల్యాణ మండపం లో సమావేశం నిర్వహించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన నిక్షయ్‌ శివిర్‌ 100 రోజుల కార్యక్రమం ద్వారా జిల్లాలో పలువురికి పరీక్షలు చేయగా 14,723 మంది అనుమానితులుగా గుర్తించామన్నారు. అందులో 8584 మందికి తెమడ పరీక్ష, 13263 మందికి ఎక్స్‌ రే పరీక్ష నిర్వహించగా తెమడ పరీక్ష ద్వారా 226 మందికి, ఎక్స్‌ రే ద్వారా 276 మందికి మొత్తం 502మందిని క్షయ వ్యాధి సోకిన వారిగా గుర్తించినట్లు తెలిపారు. వీరందిరికి చికిత్స చేస్తున్నట్లు, పౌష్టికాహారం కోసం న్యూట్రిషన్‌ కిట్స్‌లను చిన్న తరహా పరిశ్రమల సంస్థ సౌజన్యంతో అభయ ఫౌండేషన్‌ వారి ద్వారా అందించినట్లు వివరించారు. న్యూట్రిషన్‌ కిట్స్‌ చికిత్స పూర్తయ్యే వరకు అందిస్తామన్నారు. టీబీ ప్రోగ్రాం అధికారి డా. కె.వి. సుధాకర్‌ రెడ్డి, శ్రీరాములు, వాణిశ్రీ, కిరణ్‌కుమార్‌, వైద్యాధికారి శ్రవణ్‌ కుమార్‌, ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ అధ్యక్షుడు కె. రాజగోపాల్‌, ఐసిటిఎస్‌, టీబీ ప్రోగ్రాం సిబ్బంది, ఎఎన్‌ఎంలు పాల్గొన్నారు.

Updated Date - Mar 25 , 2025 | 12:36 AM