Share News

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం

ABN , Publish Date - Mar 25 , 2025 | 12:32 AM

గోదావరిఖని చౌరస్తాలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్‌ఎస్‌ నాయ కులు దహనం చేశారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ముఖ్య అతి థిగా హాజరై మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పార్టీపై కుట్రతోనే కాళేశ్వరంలో నీటిని ఖాళీ చేయించారని, దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నా రన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం

గోదావరిఖని, మార్చి 24(ఆంధ్రజ్యోతి): గోదావరిఖని చౌరస్తాలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్‌ఎస్‌ నాయ కులు దహనం చేశారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ముఖ్య అతి థిగా హాజరై మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పార్టీపై కుట్రతోనే కాళేశ్వరంలో నీటిని ఖాళీ చేయించారని, దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నా రన్నారు. తలాపున గోదావరి ఉన్నా దానిని ఎండబెడుతూ ముఖ్యమంత్రి పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ హయాంలో గోదావరి నిండుకుండలా జలకళతో ఉండేదని, కానీ ఇప్పుడు గోదావరి ఎడారిని తలపిస్తుందన్నారు. గోదావరిలో నీళ్లు లేక రైతులు అరిగోసపడుతున్నారన్నారు. నాయకులు గాదం విజయ, కల్వచర్ల కృష్ణవేణి, నారాయణదాసు మారుతి, నూతి తిరుపతి, సట్టు శ్రీనివాస్‌, స్వప్న, బొడ్డుపెల్లి శ్రీనివాస్‌, కోడి రామకృష్ణ పాల్గొన్నారు.

దిష్టిబొమ్మను దహనం చేసిన 28 మందిపై కేసు

కోల్‌సిటీ, మార్చి 24(ఆంధ్రజ్యోతి): గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన ఘటనలో రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌తోపాటు 28మందిపై వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ కార్పొరేటర్లు నారాయణదాసు మారుతి, కల్వచర్ల కృష్ణ వేణి, గాదం విజయతోపాటు మెతుకు దేవరాజు, నూతి తిరుపతిపై కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా, ఆకస్మాత్తుగా దిష్టిబొమ్మను కాల్చ డంతో మంటలు చేలరేగి ప్రజలు భయాందోళనకు గురైనట్టు పోలీసులు పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్‌ఎస్‌ నాయకులపై చర్యలు తీసుకోవాలని యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు మెంటం ఉదయ్‌ రాజ్‌, కౌటం సతీష్‌, బండి రాము, నజీ మోద్దీన్‌లు వన్‌టౌన్‌ సీఐ ఇంద్రసేనారెడ్డికి ఫిర్యాదుచేశారు. క్షీరాభిషేకం పేరుతో తప్పుదోవ పట్టించి అకస్మాత్తుగా ప్రజల మధ్యలో దిష్టిబొమ్మను వేసి దహనం చేశారని, తద్వారా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడడంతోపాటు ప్రజల్లో భయాందోళనలు కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి చర్యల వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుం దని, వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Updated Date - Mar 25 , 2025 | 12:32 AM