Share News

రాజన్న సన్నిధిలో బీసీ కమిషన్‌ చైర్మన్‌ పూజలు

ABN , Publish Date - Mar 27 , 2025 | 01:04 AM

వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని బీసీ కమిషన్‌ చైర్మన్‌ జీ. నిరంజన్‌ బుధవారం దర్శించుకున్నారు.

రాజన్న సన్నిధిలో బీసీ కమిషన్‌ చైర్మన్‌ పూజలు

వేములవాడ కల్చరల్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని బీసీ కమిషన్‌ చైర్మన్‌ జీ. నిరంజన్‌ బుధవారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో వినోద్‌రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలి కారు. స్వామివారి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఆలయ అద్దాల మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వచనం ఇవ్వగా, ఈవో రాజన్న శేషవస్ర్తాలతో పాటు ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ఆలయ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీ కమిషన్‌ చైర్మన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో కులగణన విజయ వంతంగా పూర్తి చేసుకుని అసెంబ్లీలో తీర్మానం పొందిందని, అమలు కూడా సక్రమంగా జరగాలనే ఉద్దేశ్యంతోనే రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నా మని పేర్కొన్నారు. రాష్ట్రంలోని బీసీ వర్గానికి చెందిన కొన్ని కులాలకు చెందిన పేర్లను మార్చాలని నిర్ణయం తీసుకున్నామని, బీసీ కమిషన్‌కు వచ్చిన విజ్ఞప్తుల మేరకు తుది నిర్ణయం తీసుకునే ముందు క్షేత్రస్థాయిలో అభిప్రాయాలు తీసుకో వాలని వచ్చామన్నారు. ఈ సమావేశంలో బీసీ కమిషన్‌ సభ్యులు రాపోలు జయప్రకాష్‌, తిరుమలగిరి సురేందర్‌, బాలలక్ష్మీ, బీసీ సంక్షమ అధికారి రాజ మనోహర్‌రావు తదితరులు ఉన్నారు.

Updated Date - Mar 27 , 2025 | 01:04 AM