ప్రభుత్వ వస్త్రోత్పత్తి ఆర్డర్లు పూర్తి చేయాలి
ABN , Publish Date - Mar 22 , 2025 | 12:29 AM
సిరి సిల్ల వస్త్ర పరిశ్రమకు ప్రభుత్వం కేటాయిం చిన వస్త్రోత్పత్తి అర్డర్లను నిర్ణీత సమయం లో పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్‌కుమా ర్ ఝా అన్నారు.

సిరిసిల్ల, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): సిరి సిల్ల వస్త్ర పరిశ్రమకు ప్రభుత్వం కేటాయిం చిన వస్త్రోత్పత్తి అర్డర్లను నిర్ణీత సమయం లో పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్‌కుమా ర్ ఝా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సిరిసిల్ల మరమగ్గాల వస్త్రోత్పత్తి దారులతో ప్రభుత్వ ఆర్డర్ల ఉత్పత్తిపై సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ సమగ్ర శిక్ష, సంక్షేమ శాఖలకు సంబంధించి ప్రభుత్వం వస్త్ర పరిశ్రమకు అందించిన బట్ట ఉత్పత్తి ఆర్డర్లను నిర్ణీత సమయంలో పూర్తిచేసి అందించాలన్నారు. ఇందిరా మహిళ శక్తి కార్యక్రమంలో మహి ళా సంఘాలకు ఒక్కరికి రెండు చీరల చొప్పున పంపిణీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందని, ఆర్డర్లను సిరిసిల్ల పరిశ్రమకు కేటాయించారన్నారు. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కోసం గడువులోగా ఆర్డర్లు పూర్తి చేయాలని అన్నారు. సమావేశంలో చేనేత జౌళి శాఖ ఏడీ రాఘవరా వు, టెస్కొ ప్రతినిధి శంకరయ్య, పాలిస్టర్ వస్త్రోత్పత్తి దారు ల సంఘం అధ్యక్షుడు భాస్కర్, టెక్స్‌టైల్ పార్కు అసోసి యేషన్ అధ్యక్షుడు అన్నల్‌దాస్ అనిల్, చేనేత వ్యాపార సం ఘం అధ్యక్షుడు తాటిపాముల దామోదర్, వస్త్రోత్పత్తిదారు ల సంఘం ప్రతినిధులు కళ్యాడపు సుభాష్, బూట్ల సుద ర్శన్, గాజుల రాజేశం, వాసం శ్రీనివాస్, గోవిందు రవి, బూట్ల నవీన్, అంకారపు రవి, తదితరులు పాల్గొన్నారు.