Share News

ఆటలతో శారీరక, మానసిక ఆరోగ్యం

ABN , Publish Date - Mar 24 , 2025 | 11:27 PM

ఆటలు శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తాయని ఎస్పీ డీవీ శ్రీనివాస్‌ అన్నారు. పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా కౌటాల పోలీసుస్టేషన్‌ ఆవరణలో జిల్లా యువతకు ఏర్పాటుచేసిన వాలీబాల్‌ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు.

ఆటలతో శారీరక, మానసిక ఆరోగ్యం
వాలీబాల్‌ పోటీలను ప్రారంభిస్తున్న ఎస్పీ డీవీ శ్రీనివాసరావు

- ఎస్పీ డీవీ శ్రీనివాసరావు

కౌటాల, మార్చి 24(ఆంధ్రజ్యోతి): ఆటలు శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తాయని ఎస్పీ డీవీ శ్రీనివాస్‌ అన్నారు. పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా కౌటాల పోలీసుస్టేషన్‌ ఆవరణలో జిల్లా యువతకు ఏర్పాటుచేసిన వాలీబాల్‌ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు నిత్య జీవితంలో క్రీడలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో వాలీబాల్‌ టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మారుమూల ప్రాంతంలో ఏర్పాటు చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతంలో క్రీడాకారులను ప్రోత్సాహం అందించేందుకు రోదహపడుతుందన్నారు. ఈ టోర్నమెంట్‌లో జిల్లావ్యాప్తంగా 64 జట్లు పాల్గొంటున్నాయని మూడురోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్‌లో ఈ నెల 26న ఫైనల్‌లో మొదటి మూడు స్థానాల్లో గెలుపొందిన జట్లకు నగదు బహుమతి, ప్రశంసాపత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. యువత ప్రజలు అసాంఘిక శక్తులకు దూరంగా ఉండాలన్నారు. బెట్టింగ్‌ యాప్‌, లోన్‌ యాప్‌ వంటి వాటి జోలికి వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని సూచించారు. యువత మాదకద్రవ్యాలు, గంజాయి వంటి నిషేధిత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. సంఘ విద్రోహ శక్తులకు సహాయం చేయరాదన్నారు. మానసికోల్లాసం, శారీరక ధృడత్వం కోసం క్రీడలు ఎంతగానో ఉపయోగపడుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ చిత్తరంజన్‌, డీఎస్పీ రామానుజం, సీఐలు ముత్యం రమేష్‌, రాజేంద్రప్రసాద్‌, శ్రీనివాసరావు, ఎస్సైలు మధుకర్‌, నరేష్‌, ప్రవీణ్‌, కొమురయ్య, రాజు, సందీప్‌, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2025 | 11:27 PM