ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి..
ABN , Publish Date - Mar 26 , 2025 | 12:45 AM
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసు కోవాలని జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ హన్మంతు పేర్కొన్నారు.

సిరిసిల్ల, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసు కోవాలని జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ హన్మంతు పేర్కొన్నారు. మంగళవా రం కలెక్టరేట్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు పీఎం ఈజీపీ, పీఎం ఐఎస్, పీఎం ఎఫ్‌ఎంఈ, డీఈఈటీ, విశ్వకర్మ యోజన అంశాలపై సదస్సు జరిగింది. పాలిటెక్నిక్ ఐటీఐ, డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న స్వయం ఉపాధి పథకాలను వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి రాఘవేందర్, డీఆర్‌డీవో శేషాద్రి, పరిశ్రమల ఏడీ భార తి, జిల్లాసంక్షేమ అధికారి లక్ష్మీరాజం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న పాల్గొన్నారు.