సీని ఫక్కీలో చోరీ
ABN , Publish Date - Mar 29 , 2025 | 12:41 AM
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో శుక్రవారం పట్టపగలు సినీ ఫక్కీలో చోరీ జరిగింది. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అయిలాపూర్ గ్రామానికి చెందిన చింతకుంట శ్రీహరి అనే రైతు అతని స్నేహితుడితో కలిసి కోరుట్ల పట్టణంలోని ఎస్‌బీఐ ప్రధాన బ్యాంకుకు డబ్బులు డ్రా చేయడానికి ద్విచక్రవాహనంపై వచ్చారు.

- బ్యాంకు నుంచి డ్రాచేసిన రూ. 1.50 లక్షలు అపహరణ
- జగిత్యాల జిల్లా కోరుట్లలో ఘటన
కోరుట్ల, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో శుక్రవారం పట్టపగలు సినీ ఫక్కీలో చోరీ జరిగింది. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అయిలాపూర్ గ్రామానికి చెందిన చింతకుంట శ్రీహరి అనే రైతు అతని స్నేహితుడితో కలిసి కోరుట్ల పట్టణంలోని ఎస్‌బీఐ ప్రధాన బ్యాంకుకు డబ్బులు డ్రా చేయడానికి ద్విచక్రవాహనంపై వచ్చారు. బ్యాంకులోకి వెళ్లి రూ. 1,50,000 నగదు డ్రా చేసుకొని ద్విచక్ర వాహనంలో పెట్టుకున్నాడు. అప్పటికే వీరిని గమనిస్తున్న గుర్తుతెలియని వ్యక్తులు శ్రీహరి వాహనం తీస్తున్న సమయంలో మీ జేబు నుంచి 100 రూపాయలు కింద పడిపోయాయని ఓ వ్యక్తి చూపించాడు. వాహనంపై ఉన్న శ్రీహరి కిందికి దిగి వంద రూపాయల నోటును తీసుకునే క్రమంలో వెనుకాల ఉన్న మరో గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్రవాహనంలో ఉన్న రూ. 1,50,000 నగదును అపహరించి వారు తెచ్చుకున్న ద్విచక్ర వాహనంపై పరారీ అయ్యారు. శ్రీహరి తేరుకొని చూసేసరికి బ్యాగులో ఉన్న నగదు కనపడకపోవడంతో బోరున విలపించాడు. గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బ్యాంకుతో పాటు పట్టణంలో ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించారు. అనుమానితుల సీసీ పుటేజీలను పోలీసులు విడుదల చేశారు. బాధితుడు శ్రీహరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నట్లు పోలీసులు తెలిపారు.