Share News

సమాజ సేవలో యువత ముందుండాలి

ABN , Publish Date - Mar 27 , 2025 | 11:56 PM

సమాజసేవలో యువత ముందుండాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్‌లో బోస్‌ ఫెలోషిప్‌ వాలంటీర్లు చేపట్టిన యంగ్‌ ఓరిటర్‌ ప్రోగ్రాం ముగింపులో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రతీ విద్యా ర్థికి కనీస అభ్యసన సామర్థ్యాలు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తుందన్నారు.

సమాజ సేవలో యువత ముందుండాలి

పెద్దపల్లి కల్చరల్‌, మార్చి 27(ఆంధ్రజ్యోతి): సమాజసేవలో యువత ముందుండాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్‌లో బోస్‌ ఫెలోషిప్‌ వాలంటీర్లు చేపట్టిన యంగ్‌ ఓరిటర్‌ ప్రోగ్రాం ముగింపులో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రతీ విద్యా ర్థికి కనీస అభ్యసన సామర్థ్యాలు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తుందన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు వెనుకంజలో ఉండ కుండా యువత ముందుకు వచ్చి విద్యార్థులకు మెరుగైన విద్య అందిం చేందుకు స్వచ్ఛందంగా పనిచేయాలని కలెక్టర్‌ తెలిపారు. బోస్‌ఫెలోషిప్‌ కార్యక్రమం కింద 8నెలల నుంచి వాలంటీర్లుగా పనిచేస్తున్న డిగ్రీ కళా శాల విద్యార్థులు ఎంపిక చేసిన 30ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రాథమిక తరగతి విద్యార్థులకు విద్యాబోధన చేయడంపై కలెక్టర్‌ అభినందించారు. డిగ్రీ చదివే విద్యార్థులు నాయకత్వ లక్షణాలను పెంచుకొని దేశానికి ఉపయోగపడే కార్యక్రమాలను కొనసాగించాలని సూచించారు. విద్యా ర్థిని, విద్యార్థులు, ప్రాథమిక తరగతి పిల్లలు నిర్వహించిన వివిధ నృత్య ప్రదర్శనలు అలరించాయి. జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి, ఏం ఎంఓ డాక్టర్‌ షేక్‌, యంగ్‌ ఓరిటర్‌ విద్యార్థిని, విద్యార్థులు, బోస్‌ ఫెలోషిప్‌ వాలంటీర్లు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2025 | 11:56 PM