Share News

Khairatabad: అమెరికాలో రోడ్డు ప్రమాదం హైదరాబాద్‌ వాసి మృతి

ABN , Publish Date - Jan 30 , 2025 | 05:38 AM

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖైరతాబాద్‌ ఎంఎస్‌ మక్తావాసి మహమ్మద్‌ వాజిద్‌(28) మృతి చెందాడు. ఇతడు ఎంఎస్‌ చదివేందుకు అమెరికా వెళ్లి, చదువు పూర్తి కాగా పార్ట్‌టైం ఉద్యోగం చేస్తున్నాడు.

Khairatabad: అమెరికాలో రోడ్డు ప్రమాదం హైదరాబాద్‌ వాసి మృతి

ఖైరతాబాద్‌, జనవరి 29 (ఆంధ్రజ్యోతి) : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖైరతాబాద్‌ ఎంఎస్‌ మక్తావాసి మహమ్మద్‌ వాజిద్‌(28) మృతి చెందాడు. ఇతడు ఎంఎస్‌ చదివేందుకు అమెరికా వెళ్లి, చదువు పూర్తి కాగా పార్ట్‌టైం ఉద్యోగం చేస్తున్నాడు. చికాగో నుంచి 500 కి.మీ. దూరంలో ఉన్న టాంగో వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉండగా ఐవా వద్ద ఓ భారీ ట్రక్కు ఇతడు ప్రయాణిస్తున్న కారును ఢీకొనడంతో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.


భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 4 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఇతడి తండ్రి మహమ్మద్‌ ఐజాజ్‌ జలమండలి ఉద్యోగి కాగా తల్లి షమీం బేగం గృహిణి. ఖైరతాబాద్‌ యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడిగా పనిచేసిన వాజిద్‌ మృతితో ఎంపీ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఆయన ఇంటి వద్దకు వచ్చి కుటుంబసభ్యులను పరామర్శించారు. వాజిద్‌ ప్రస్తుతం ఎన్‌ఆర్‌ఐ కాంగ్రెస్‌ కమిటీ మైనారిటీ విభాగం సభ్యుడిగా ఉన్నాడు.

Updated Date - Jan 30 , 2025 | 05:38 AM