DCP: పోగొట్టుకున్న సొమ్ము బాధితుల ఖాతాల్లో జమ..
ABN , Publish Date - Feb 21 , 2025 | 10:20 AM
ఇన్వెస్టిమెంట్‌లో అధిక లాభాలు వస్తాయని, రుణాలు ఇప్పిస్తామని, డ్రగ్స్ పార్శిల్స్ పేరుతో భయపెట్టి ఇలా రకరకాల మోసాలకు పాల్పడి అమాయక ప్రజల నుంచి అందినంతా దండుకున్నారు సైబర్ నేరగాళ్లు.

- వేర్వేరు కేసుల్లో రూ. 62.46 లక్షలు రికవరీ
- గోల్డెన్ అవర్‌లో ఫిర్యాదు చేయాలి: డీసీపీ కవిత
హైదరాబాద్ సిటీ: ఇన్వెస్టిమెంట్‌లో అధిక లాభాలు వస్తాయని, రుణాలు ఇప్పిస్తామని, డ్రగ్స్ పార్శిల్స్ పేరుతో భయపెట్టి ఇలా రకరకాల మోసాలకు పాల్పడి అమాయక ప్రజల నుంచి అందినంతా దండుకున్నారు సైబర్ నేరగాళ్లు. మోసపోయామని గ్రహించిన పలువురు బాధితులు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. సిటీ సైబర్ క్రైమ్ డీసీపీ కవిత(City Cyber Crime DCP Kavitha) ఆదేశాలతో ఏసీపీ శివమారుతి పర్యవేక్షణలో సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా సైబర్ నేరగాళ్ల బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: JNTU: సరిపోదు.. ఒక శనివారం.. మరో వారం కూడా సెలవు ఇవ్వాలని జేఎన్‌టీయూ సిబ్బంది వినతి
పోగొట్టుకున్న డబ్బు రూ. 62,46,900 పోలీసులు రికవరీ చేసి న్యాయస్థానం అనుమతితో బాధితుల ఖాతాల్లో జమ చేశారు. డీసీపీ కవిత తెలిపిన వివరాల ప్రకారం.. ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నగరానికి చెందిన 8 మంది నుంచి, ఫెడెక్స్ పార్శిల్ పేరుతో డ్రగ్స్‌ను పంపుతున్నారంటూ మరో ఆరుగురిని బెదింరించిన క్రిమినల్స్ వారి నుంచి రూ. లక్షల్లో కొల్లగొట్టారు. ఆన్‌లైన్ రుణాలు(Online loans) అందిస్తామని ఒకరు.. కంపెనీ ఇన్వాయిస్ నెపంతో ఇంకొక కేసులో సైబర్‌క్రిమినల్స్ రూ. లక్షలు కొల్లగొట్టారు.
బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా సైబర్ నేరగాళ్ల బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసి, వారు కొట్టేసిన దాదాపు రూ.62,47,087 డబ్బును రికవరీ చేశారు. సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి డబ్బులు పోగొట్టుకుంటున్న బాధితులు మొదటి గంటలోపు (గోల్డెన్ అవర్) పోలీసులను ఆశ్రయించాలి. లేదంటే ఎన్‌సీఆర్‌పీ పోర్టల్‌ల్లోనో, 1930 టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించి సైబర్ నేరగాళ్లు కొట్టేసిన సొత్తును ఎక్కడో ఒకచోట సైబర్ నేరగాళ్ల ఖాతాల్లో ఫ్రీజ్ చేసి బాధితులకు న్యాయం చేసే అవకాశం ఉంటుందని డీసీపీ ధార కవిత తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: Water Shortage: పట్టణాల్లో నీటికి కటకట
ఈవార్తను కూడా చదవండి: యువ వైద్యురాలి ప్రాణం తీసిన ఈత సరదా
ఈవార్తను కూడా చదవండి: చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ
ఈవార్తను కూడా చదవండి: అడవి పందుల వేటకు వెళ్లి... విద్యుదాఘాతానికి ముగ్గురి బలి
Read Latest Telangana News and National News