తగ్గిన ఉల్లి ధరలు
ABN , Publish Date - Mar 26 , 2025 | 11:15 PM
రోజు రోజుకు తగ్గుతున్న ఉల్లి ధరలు రైతులను నిరాశకు గురి చేస్తున్నాయి.

- క్వింటాలుకు గరిష్ఠంగా రూ.2వేలు, కనిష్ఠంగా రూ.1,320
దేవరకద్ర, మార్చి 26 (ఆంధ్రజ్యోతి) : రోజు రోజుకు తగ్గుతున్న ఉల్లి ధరలు రైతులను నిరాశకు గురి చేస్తున్నాయి. దేవరకద్ర మార్కెట్ యార్డులో వ్యాపారులు బుధవారం నిర్వహించిన వేలం పాటలో క్వింటాలుకు గరిష్ఠంగా రూ.2,000, కనిష్ఠంగా రూ.1,320 ధర పలికినట్లు మార్కెట్ సెక్రటరీ ఎల్లయ్య తెలిపారు. 863 క్వింటాళ్ల ఉల్లి అమ్మకానికి తెచ్చినట్లు చెప్పారు. నెల రోజులుగా ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. ధరల తగ్గుదలతో పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు అంటున్నారు. ఇప్పుడు సీజన్ కావడంతో మార్కెట్‌కు ఉల్లి వస్తోంది. క ర్నూల్, హైదరాబాద్ మార్కెట్‌లకు మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి వందలాది లారీల ఉల్లి రావడంతో ధరలు పడిపోయాయని వ్యాపారులు అంటున్నారు. బయట నుంచి వచ్చే ఉల్లి ధర కంటే.. దేవరకద్ర మార్కెట్‌లో ధర క్వింటాలుపై రూ.200 నుంచి రూ.300 ఎక్కువగా ఉందని వ్యాపారులు తెలిపారు. ఎక్కువగా ఎర్ర ఉల్లికి ధరలు రావడం లేదని, తెల్ల ఉల్లికి కొంత డిమాండ్ ఉంది.