పాలమూరులో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయండి
ABN , Publish Date - Apr 02 , 2025 | 11:33 PM
పాలమూరులో సిమెంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామిని మాజీ మంత్రి శ్రీనివా్‌సగౌడ్ కోరారు. ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, సురే్‌షకుమార్‌రెడ్డి, దామోదర్‌రావుతో కలిసి బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించారు.

కేంద్రమంత్రి కుమారస్వామికి శ్రీనివా్‌సగౌడ్ వినతి
హైదరాబాద్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): పాలమూరులో సిమెంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామిని మాజీ మంత్రి శ్రీనివా్‌సగౌడ్ కోరారు. ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, సురే్‌షకుమార్‌రెడ్డి, దామోదర్‌రావుతో కలిసి బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించారు. మహబూబ్‌నగర్‌లో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని పేర్కొన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీకి అవసరమైన సున్నపురాయి, లాటరైట్ రాయి వంటి ముడి పదార్థాలతో పాటు స్కిల్ వర్కర్లు అందుబాటులో ఉన్నారనిచెప్పారు. హైదరాబాద్, రాయచూర్, గుల్బర్గా వంటి ఐటీకారిడార్ ప్రాంతాలు దగ్గరలో ఉన్నాయన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు ద్వారా ఈప్రాంత అభివృద్థితోపాటు ఉపాధి లభిస్తుందని, ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపడేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. సీసీఐ(సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ద్వారా కొత్త సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రికి శ్రీనివా్‌సగౌడ్ విజ్ఞప్తి చేశారు.