Share News

ఉత్తమ పంచాయతీలను ఎంపిక చేయాలి

ABN , Publish Date - Mar 27 , 2025 | 11:08 PM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అవార్డుల కోసం జిల్లాలోని ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేసి పంపాలని డీపీవో పార్థసారథి ఎంపీడీవోలను, ఎంపీవోలను, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.

ఉత్తమ పంచాయతీలను ఎంపిక చేయాలి

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌, మార్చి 27 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అవార్డుల కోసం జిల్లాలోని ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేసి పంపాలని డీపీవో పార్థసారథి ఎంపీడీవోలను, ఎంపీవోలను, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. గురువారం కలెక్టరెట్‌లోని తన కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ఏదైన గ్రామంలో పవన విద్యుత్‌తో గాని, సౌర విద్యుత్‌తో గాని విద్యుత్‌ అవసరాలు తీర్చుకుంటూ సదరన్‌ పవర్‌పై ఆధారపడకుండా ఉన్న గ్రామాలను ఎంపిక చేయాల్సి ఉంటుందన్నారు. గ్రామాల్లో ఇంటి పన్నులే కాకుండా అన్ని రకాల వినోద పన్నులు వసూలు చేసిన గ్రామాలను ఎంపిక చేసి, ఆన్‌లైన్‌ ద్వారా రాష్ట్రానికి, అక్కడి నుంచి కేంద్రానికి పంపడం జరుగతుందన్నారు. ఆ గ్రామాలను రాష్ట్ర, కేంద్రం నుంచి వచ్చిన రెండు బృందాలు పరిశీలించి, ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపిక చేస్తారని తెలిపారు. ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపికైన గ్రామాలకు మొదటి బహుమతిగా రూ.కోటి, రెండో బహుమతి కింద రూ.50 లక్షలు, మూడో బహుమతిగా రూ.25 లక్షలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇప్పటికే ఇంటి పన్నుల వసూలులో రాష్ట్రంలో మూడో స్థానంలో ఉన్నామని, ఆర్థిక సంవత్సరం ముగియడానికి కొద్ది రోజులు గడువు ఉన్నందున ప్రత్యేక దృష్టి సారించి 100 శాతం పన్నులు వసూలు చేయాలరి సూచించారు. డీఎల్‌పీవో అలిముద్ధీన్‌, మహబూబ్‌నగర్‌ ఎంపీవో శంకర్‌నాయక్‌, డీపీఎం వహిద్‌ పాల్గొనారు.

Updated Date - Mar 27 , 2025 | 11:08 PM