Share News

కేంద్రం రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తోంది

ABN , Publish Date - Apr 02 , 2025 | 11:33 PM

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తోందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. ఈ విషయాన్ని దేశ ప్రజలకు వివరించేందుకు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్లమెంట్‌లో ప్రతిపక్ష నాయకులు రాహుల్‌గాంధీ పిలుపు మేరకు పార్టీ ఆధ్వర్యంలో జైబాపు.. జైభీమ్‌.. జై సంవిధాన్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

కేంద్రం రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తోంది
జైబాపు జైభీమ్‌ జైసంవిధాన్‌ పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి

మహబూబ్‌నగర్‌, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తోందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. ఈ విషయాన్ని దేశ ప్రజలకు వివరించేందుకు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్లమెంట్‌లో ప్రతిపక్ష నాయకులు రాహుల్‌గాంధీ పిలుపు మేరకు పార్టీ ఆధ్వర్యంలో జైబాపు.. జైభీమ్‌.. జై సంవిధాన్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పాత పాలమూరు అంబేడ్కర్‌ విగ్రహం నుంచి ఎమ్మెల్యే యెన్నం పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మైనారిటీలు రక్షణ కోల్పోతున్నారన్నారు. అనేక సందర్భాలలో రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించి కేంద్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను తేవాలని చూస్తోందని విమర్శించారు. వాటన్నింటిపై ప్రజలను చైతన్య పరిచి, రా జ్యాంగాన్ని కాపాడుకునే బా ధ్యత దేశంలోని ప్రతీ వ్యక్తిపై ఉ న్నదన్నారు. అందుకే ప్రజలను జాగృతం చేసేందుకు కాంగెరస్‌ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ప్రతీ వార్డు, గ్రామం, వీధి, ఇంటికి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ఈ బాధ్యతను తీసుకుంటారన్నారు. కేంద్ర ప్రభుత్వ కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నగరంలోని 11, 25 వార్డులలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌గౌడ్‌, నాయకులు జహీర్‌అక్తర్‌, చంద్రకుమార్‌గౌడ్‌, ఎన్‌పీ వెంకటేశ్‌, సిరాజ్‌ఖాద్రి, బెక్కరి మధుసూదన్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, సీజే బెనహర్‌ పాల్గొన్నారు.

మహబుబ్‌నగర్‌ రూరల్‌: మండలంలోని మన్యంకొండ అలివేలు మంగమ్మదేవస్థాన ఆవరణ నుంచి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి బుధవారం జై బాపు జైభీమ్‌ జైసంవిధాన్‌ పాదయాత్రను ప్రారంభించారు. అప్పాయిపల్లి, కోడూరు చౌరస్తా వరకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మల్లు నర్సింహారెడ్డి, నాయకులతో కలిసి 4 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చే స్తున్నదని, ఇది మానవ హ క్కులను హరించే కుట్ర అని అన్నారు. T

Updated Date - Apr 02 , 2025 | 11:33 PM