Share News

MLA Rakesh Reddy: ఆకలి ఉన్నవాడికే బియ్యం ఇవ్వండి

ABN , Publish Date - Mar 28 , 2025 | 03:31 AM

త్వరలో తెల్ల రేషన్‌కార్డుదారులకు పంపిణీ చేయనున్న సన్నబియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

MLA Rakesh Reddy: ఆకలి ఉన్నవాడికే బియ్యం ఇవ్వండి

  • సర్కార్‌కు పైడి రాకేశ్‌రెడ్డి సూచన

  • నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించాలి

  • బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి

  • ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి

  • సీపీఐ సభ్యుడు కూనంనేని వినతి

హైదరాబాద్‌, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): త్వరలో తెల్ల రేషన్‌కార్డుదారులకు పంపిణీ చేయనున్న సన్నబియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శాసనసభ బడ్జెట్‌ సమావేశాల చి వరి రోజు జీరో అవర్‌ను 105 నిమిషాల పాటు కొన సాగించారు. ప్రశ్నోత్తరాలను రద్దు చేసిన స్పీకర్‌... జీరో అవర్‌లో పలువురు సభ్యులు మాట్లాడేందుకు అవకాశమిచ్చారు. ఈ సందర్భంగా రాకేశ్‌రెడ్డి మా ట్లాడుతూ.. ‘ఆకలి ఉన్నవాడికే తెల్లకార్డులు, బియ్యం ఇవ్వండి. రేషన్‌ బియ్యాన్ని ప్రస్తుతం రూ.1కి కొని రూ.15లకు అమ్ముకుంటున్నారు. ఉగాది నుంచి ఇ చ్చే సన్న బియ్యం పక్కదారి పట్టకుండా నియంత్రించాలి’ అని డిమాండ్‌ చేశారు. నిజాం షుగర్స్‌ ఫ్యాక్టరీని తెరిపించాలని బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి కోరారు.


భద్రాచలం ఆలయ పాలక మండలిని ఏర్పాటు చేయాలని, రాములోరి కల్యాణానికి సభ్యులు రావాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రా వు కోరారు. విదేశీ విద్యానిధి పథకం బకాయిలు చెల్లించాలని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కోరారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని కోరారు. కిడ్నీ బాధితుల కోసం కల్లూరు, పెనుబల్లిలో డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి కోరారు. సభ జరుగుతుండగా... హరీశ్‌రావు సభలో లోపలి ఫొటోలు తీశారని, స్పీకర్‌, సీఎం, డిప్యూటీ సీఎంలంటే వారికి ఇష్టం లేదని, అబద్ధాలు మాట్లాడుతున్నారని విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

Updated Date - Mar 28 , 2025 | 03:31 AM