Mahesh Kumar Goud: స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి
ABN , Publish Date - Feb 17 , 2025 | 04:05 AM
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని, యువజన కాంగ్రెస్ నాయకులు సైనికుల్లా పనిచేయాలని, సీఎం రేవంత్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్ పిలుపునిచ్చారు.

యువజన నేతలు సైనికుల్లా పనిచేయాలి: మహేశ్‌గౌడ్
మహేశ్వరం, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని, యువజన కాంగ్రెస్ నాయకులు సైనికుల్లా పనిచేయాలని, సీఎం రేవంత్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్ పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గట్టుపల్లి గ్రామంలోని ఓ గార్డెన్‌లో ఆదివారం రాష్ట్ర యువజన కాంగ్రెస్ యువక్రాంతి పేరుతో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను ఆయన జెండా ఆవిష్కరించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివర్గాల ప్రయోజనాల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడవకముందే 50 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు పేర్కొన్నారు. దేశంలో మోదీ శకం ముగిసిందని, ఇక భవిష్యత్ అంతా రాహుల్‌గాంధీదేనని పేర్కొన్నారు.